ఏఐ అశ్లీల ఫోటోల కోసం వెబ్‌సైట్లు, యాప్స్‌కు పోటెత్తుతున్న యూజర్లు! | Apps That Use Ai To Undress Women In Photos Are Soaring In Popularity | Sakshi
Sakshi News home page

ఏఐ అశ్లీల ఫోటోల కోసం వెబ్‌సైట్లు, యాప్స్‌కు పోటెత్తుతున్న యూజర్లు!

Published Sat, Dec 9 2023 8:15 AM | Last Updated on Sat, Dec 9 2023 8:55 AM

Apps That Use Ai To Undress Women In Photos Are Soaring In Popularity - Sakshi

ప్రపంచ దేశాల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగం పెరిగిపోవడంతో ఆన్‌లైన్‌లో అశ్లీలత విపరీతంగా పెరిపోతున్నట్లు తేలింది. ఫలితంగా ఏఐని ఉపయోగించి మహిళల ఫోటోల్ని అశ్లీలంగా చూపే యాప్‌లు, వెబ్‌సైట్‌లు ప్రాచుర్యం పొందుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.

ఈ సెప్టెంబర్‌లోనే 24 మిలియన్ల మంది యూజర్లు ఏఐ మహిళల ఫోటోల్ని వీక్షించేందుకు వాటిని డిజైన్‌ చేసే వెబ్‌ పోర్టల్స్‌, యాప్స్‌కు పోటెత్తినట్లు సోషల్ నెట్‌వర్క్ అనాలసిస్‌ సంస్థ గ్రాఫికా గుర్తించింది. 

ముఖ‍్యంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి యూజర్లకు సర్వీసులు అందించేలా పలు రకాల యాప్స్‌ ప్రముఖ సోషల్‌ మీడియా నెట్‌వర్కింగ్‌ సైట్లలో ఏఐ అశ్లీల ఫోటోలతో ప్రకటనలు ఇస్తున్నాయని, ఆ సంఖ్య 2,400 శాతానికి చేరినట్లు తెలిపింది. వాటిల్లో ఎక్స్‌.కామ్‌తో పాటు రెడ్డిట్‌ కూడా ఉన్నట్లు గ్రాఫికా రీసెర్చర్లు గుర్తించారు.   

ఇందుకోసం ఏఐ నిపుణులు మహిళల ఫోటోల్ని రీక్రియేట్‌ చేసి వాటి సాయంతో  ఏఐ అశ్లీల ఫోటోల్ని తయారు చేస్తున్నారని.. అనంతరం ఆ ఫోటోలతో యాప్స్‌, వెబ్‌ పోర్టల్స్‌ సర్వీసులు అందిస్తున్నట్లు తెలిపింది. అయితే, దీనికి అడ్డుకట్ట వేసేలా ఆయా ప్రభుత్వాలు, ఏఐ సంస్థలు ఆంక్షలు విధించాలని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement