2026 రేడియాన్ బైక్ లాంచ్.. రూ.67000 మాత్రమే! | 2026 TVS Radeon Launched In India At Rs 67100 Ahead Of Festive Season | Sakshi
Sakshi News home page

2026 రేడియాన్ బైక్ లాంచ్.. రూ.67000 మాత్రమే!

Oct 13 2026 4:31 PM | Updated on Oct 13 2026 4:42 PM

2026 TVS Radeon Launched In India At Rs 67100 Ahead Of Festive Season

టీవీఎస్ మోటార్‌సైకిల్‌ తన కమ్యూటర్ బైక్ 'రేడియాన్'ను ఆధునిక హంగులతో లాంచ్ చేసింది. ఈ 2026 మోడల్ ఆల్ ఎల్ఈడీ లైటింగ్, గ్రాఫిక్స్, కొత్త రంగులలో లభిస్తుంది. ఈ అప్‌డేటెడ్ మోడల్ ధర రూ. 67,100 నుంచి రూ. 73,100 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.

2026 రేడియాన్ బైక్.. బేస్, డిజి-డ్రమ్, డిజి-డిస్క్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. బేస్ వెర్షన్ ధర ఇప్పుడు మునుపటి కంటే రూ. 1,250 ఎక్కువగా ఉండగా, టాప్ డిజి-డిస్క్ వేరియంట్ ధర రూ. 7,500 తక్కువగా ఉంది.

కొత్త రేడియాన్ బైక్.. ప్రత్యేకమైన డేటైమ్ రన్నింగ్ లైట్‌తో కూడిన కొత్త హెడ్‌ల్యాంప్, ఒక ఎల్ఈడీ టెయిల్-ల్యాంప్, రెండు చివర్లలో ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లు లభిస్తాయి. ఈ ఫీచర్లు బేస్, డిజి-డ్రమ్, డిజి-డిస్క్ వేరియంట్లలో స్టాండర్డ్‌గా వస్తాయి. ముందు డిస్క్ బ్రేక్‌తో వచ్చే ఏకైక వెర్షన్ డిజి-డిస్క్ మాత్రమే కాగా, మిగిలిన రెండు వేరియంట్లు డ్రమ్ బ్రేక్‌లను ఉపయోగిస్తాయి. లైటింగ్, రంగు అప్‌డేట్‌లు మినహా మోటార్‌సైకిల్ ఫీచర్లలో టీవీఎస్ ఎలాంటి మార్పును ప్రకటించలేదు.

2026 టీవీఎస్ రేడియాన్ బైక్ ఇంజిన్‌లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి అదే 8 హార్స్ పవర్, 8.7 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేసే 109.7 సీసీ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. దీనికి 4 స్పీడ్ గేర్‌బాక్స్ జత చేయబడింది. ఈ బైక్ ఫ్యూయల్-ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లు కాగా.. మైలేజ్ 69.3 కిమీ/లీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement