ఏచూరి ఆశయాలు సాధించాలి | - | Sakshi
Sakshi News home page

ఏచూరి ఆశయాలు సాధించాలి

Sep 13 2026 1:00 AM | Updated on Sep 13 2026 1:00 AM

రుద్రంపూర్‌: అణగారిన వర్గాల గొంతుక సీతారాం ఏచూరి ఆశయాలు సాధించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. శనివారం సీపీఎం అఖిల భారత మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి రెండో వర్ధంతి సభ కొత్తగూడెంలో జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు. ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ లౌకికవాదంపై దాడి జరిగిన ప్రతీసారి ఏచూరి గట్టిగా ప్రతిఘటించారని గుర్తుచేశారు. ప్రజాసమస్యలపై పదునైన వాదన, మార్క్సిజంపై లోతైన అధ్యయనం.. ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయన్నారు. పార్టీ నాయకులు బండారి రవికుమార్‌, కొలగాని బ్రహ్మాచారి, ఏజే రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement