కొత్తగూడెంఅర్బన్/సూపర్‌బజార్(కొత్తగూడెం): ఉపాధ్యాయులే సమాజానికి దిక్సూచి అని నల్లగొండ జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.రమాదేవి అన్నారు. యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు జె.బి. బాలు ఆధ్వర్యంలో జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి అవార్డులను ప్రదానం చేశారు. కొత్తగూడెంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని 24 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించే అంశాలు భవిష్యత్‌కు భరోసా కల్పిస్తాయన్నారు. టీజీఓ జిల్లా అధ్యక్షుడు సంగం వెంకటపుల్లయ్య మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై నవారిపై మరింత బాధ్యత పెరుగుతుందని అన్నారు. జిల్లా ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ రంగా ప్రసాద్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ గౌరవ జిల్లా అధ్యక్షుడు బి. వీరూ నాయక్, ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు సాయి క్రిష్ణ, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి, రత్నాకర్, హనుమాన్ జిమ్ కమలాకర్, మొక్కల బాలు, రాజేష్, రంగ, సుభాని, జయశ్రీ, వర ప్రసాద్, బాలకృష్ణ, నాగ కుమార్ పాల్గొన్నారు.


