విహంగ విహారం | - | Sakshi
Sakshi News home page

విహంగ విహారం

Sep 13 2026 1:00 AM | Updated on Sep 13 2026 1:00 AM

రాజకీయ ఒత్తిడితోనే..

ఎయిర్‌పోర్టు ఆశలపై నీళ్లు చల్లేలా ఏఏఐ సిఫార్సులు

మిగిలిన చోట్ల లేని నిబంధనలు ఇక్కడే ఎందుకు?

టెక్నికల్‌ సొల్యూషన్‌, రాజకీయ ఒత్తిడితోనే సాకారం

ఢిల్లీపై ఒత్తిడితోనే

సీతంపేటకు రైల్వేలైన్‌ అభ్యంతరం

జిల్లాలో ప్రతిపాదిత గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయ స్థలాలుగా సుజాతనగర్‌ మండలంలోని సీతంపేట, సుజాతనగర్‌, దుమ్ముగూడెం మండలంలోని దుమ్ముగూడెం, ములకలపల్లి మండలంలోని చాపరాలపల్లి, దమ్మపేట మండలంలోని పాల్వంచ/దమ్మపేట, చుంచుపల్లి మండలంలోని పెనగడప ప్రాంతాలను గుర్తించారు. ఇందులో సీతంపేట–సుజాతనగర్‌లో ఉన్న 667 ఎకరాల స్థలం అత్యుత్తమైనదిగా ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. ఈ స్థలానికి సమీపం నుంచి సత్తుపల్లి –భద్రాచలంరోడ్‌ రైల్వేలైన్‌ వెళ్తున్న విషయంపై ఏఏఐ బృందం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రస్తుతం చైన్నె, ఢిల్లీలలో ఉన్న ఎయిర్‌పోర్టులకు నేరుగా మెట్రో రైలు సౌకర్యం ఉంది. హై వోల్టేజ్‌ విద్యుత్‌తోనే ఆ రైళ్లు నడుస్తున్నాయి. త్వరలో హైదరాబాద్‌ మెట్రో సర్వీసును సైతం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు మీదుగా ఫ్యూచర్‌ సిటీ వరకు పొడిగించనున్నారు. రైల్వే ట్రాక్‌ వల్ల ఏర్పడే ఎలక్ట్రో మాగ్నెటిక్‌ ఫీల్డ్‌తో ఇబ్బందులు ఉంటే దాన్ని షీల్డింగ్‌ టెక్నాలజీ ద్వారా అధిగమించే అవకాశం ఉంది.

4సీకే పట్టించుకోలేదు

కొత్తగూడెం లాంటి చిన్న నగరాల్లో బోయింగ్‌, ఎయిర్‌బస్‌ లాంటి భారీ విమానాలకు తగ్గ డిమాండ్‌ ఉండదు. 26 మీటర్లు రెక్కల సైజు ఉండి, 80 సీట్ల సామర్థ్యం ఉండే చిన్న తరహా ఏటీఆర్‌ 72 మోడల్‌ విమానాలకే డిమాండ్‌ ఉండే అవకాశం ఉంది. ఈ చిన్న తరహా విమానాలు వచ్చి పోయేందుకు 1.5 కి.మీ నుంచి 1.6 కి.మీ పొడవైన రన్‌ వే సరిపోతుంది. మరోవైపు బోయిగ్‌ 320 సీ రకం విమానం దిగేందుకు వీలుగా పెద్దదైన రన్‌వే కావాలని ప్రతీసారి ఏవియేషన్‌ నిపుణుల బృందం చెబుతోంది. దీంతో స్థానికంగా కొండలు, అడవులు, వాగులు వంటి భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్‌ను ఎయిర్‌డ్రోమ్‌ రిఫరెన్స్‌ (ఏఆర్‌సీ) కోడ్‌ 4సీ ప్రమాణాల ప్రకారం నిర్మించాలని నిర్ణయించారు. కోడ్‌ 4సీ ప్రకారం 1.80 కి.మీ రన్‌వే సరిపోతుంది. ఈ రన్‌వే మీద రెక్కల సైజు 36 మీటర్లు ఉండే బోయింగ్‌ 320 మోడల్‌ విమానాలు సులభంగా టేకాఫ్‌, ల్యాండ్‌ అవగలవు.

మళ్లీ అదే పాట

కొత్తగూడెంలో కోడ్‌ 4సీని విస్మరించిన ఏఏఐ బృందం మరోసారి 2.7 కి.మీ పొడవైన రన్‌వేకు అనుగుణంగా భూమి కావాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దాదాపు వెయ్యి నుంచి పన్నెండు వందల ఎకరాల స్థలం అవసరమని పరోక్షంగా వెల్లడించింది. రిజర్వ్‌ ఫారెస్ట్‌, అభయారణ్యం, ఎత్తైన కొండలు, నదులు, వాగులు, నల్ల రేగడి నేలలు జిల్లాలో ఎక్కువ. ఇక్కడి భౌగోళిక పరిస్థితులు, జనాభా, పర్యాటక అవకాశాలు, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని అందుకు అనుగుణమైన ఎయిర్‌పోర్టును నిర్మించాలి. అందుకు విరుద్ధంగా 20 లక్షల జనాభాకు మించి ఉండే మెట్రో నగరాల తరహాలో భారీ రన్‌వేలు, టెర్మినల్స్‌ నిర్మించేందుకు వీలుగా స్థల సేకరణ చేయాలన్నట్టు ఏఏఐ బృందం వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.

జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం ఎంపిక చేసిన నాలుగు ప్రదేశాల్లో ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ), మల్టీ డిసిప్లీనరీ బృందం ఈ నెల 7,8 తేదీల్లో పర్యటించింది. నాలుగు స్థలాలపై పూర్తి స్థాయిలో సంతృప్తి చెందని బృందం అప్పటికప్పుడు బూర్గంపాడు మండలం సారపాక దగ్గర ఐదో స్థలాన్ని కూడా పరిశీలించింది. దీంతో ఏఏఐ బృందం పెట్టే కొర్రీలతో జిల్లాకు ఎయిర్‌పోర్టు వస్తుందా? రాదా ? అనే సందేహాలు పెరిగాయి.

–సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం

క్షేత్రస్థాయి ఇబ్బందులు, పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా ఏఏఐ బృందం వెలిబుచ్చే కొర్రీలకు సాంకేతిక పరిష్కార మార్గాలు చూపడంతోపాటు రాజకీయ ఒత్తిడి కూడా తీసుకురాల్సిన అవసరం రాష్ట్ర సర్కారుతో పాటు పార్లమెంటు సభ్యులపై ఉంది. హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉన్న డెహ్రాడూన్‌, సిమ్లా, ధర్మశాల వంటి ప్రాంతాల్లో రెండు వందల ఎకరాల కనీస విస్తీర్ణంలోనే ఎయిర్‌పోర్టులు ఉంటున్నాయి. చైన్నె, ఢిల్లీ వంటి చోట ఎయిర్‌పోర్టు ప్రాంగణంలోనే మెట్రో రైలు సర్వీసులు ఉన్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను బేరీజు వేసి, సరైన రీతిలో కేంద్రంపై రాజకీయంగా ఒత్తిడి తీసుకురాగలితేనే జిల్లాకు గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు వస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇటీవల రెండు రోజులపాటు జిల్లాలో పర్యటించిన బృందం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement