చర్ల: జిల్లాతోపాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తాలిపేరు ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరుగుతోంది. శనివారం ప్రాజెక్ట్‌కు చెందిన 25 గేట్లలో నాలుగు గేట్లను ఎత్తి ఉంచి 10,297 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా 73.67 మీటర్ల వద్ద క్రమబద్ధీకరిస్తున్నారు.
రెండో విడత స్టడీ టూర్
సింగపూర్ వెళ్లిన ఉపాధ్యాయులు
కొత్తగూడెంఅర్బన్: విదేశాల్లో విద్యావిధానాన్ని అధ్యయనం చేసి ఇక్కడ విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత నెల 5న ఉపాధ్యాయుల బృందాన్ని జపాన్ పంపింది. రెండో విడతలో శనివారం మరో బృందం సింగపూర్‌కు బయల్దేరింది. ఈ నెల 19వ తేదీ వరకు టూర్ కొనసాగనుండగా, జిల్లా నుంచి పాతపాల్వంచ జెడ్పీహెచ్‌ఎస్ ఉపాధ్యాయురాలు ఏ.పద్మలత, పాలకోయతండా ఎంపీపీస్ ఉపాధ్యాయుడు షేక్ లాల్‌బీ, కొమ్ముగూడెం జెడ్పీహెచ్‌ఎస్ ఉపాధ్యాయురాలు శ్రీదేవి ఆ బృందంలో ఉన్నారు.


