దుమ్ముగూడెం: మండలంలోని మంగ్వాయిబాడ్వ గ్రామానికి చెందిన కుంజా ఆదయ్య, పాయం లక్ష్మయ్యకు చెందిన పొలంలో పెంచిన 17 టేకు చెట్లను అక్రమంగా గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం నరికివేసి చోరీ చేశారు. తమ పొలంలో పెంచిన టేకు చెట్లల్లో సుమారు 17 చెట్లను నరికి చోరీ చేశారని బాధితులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీస్‌స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
ఆటో, బైక్ ఢీ..
ఇద్దరికి గాయాలు
ఇల్లెందురూరల్: మండలంలోని కొమ్ముగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని బాలికల ఆశ్రమ పాఠశాల వద్ద శుక్రవారం ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. కొమ్ముగూడెం గ్రామానికి చెందిన సూర్నపాక రవి, స్వరూప పొలం నుంచి ఇంటికి బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. రవి, స్వరూప గాయపడటంతో స్థానికులు ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


