వైభవంగా బేతంపూడి ఉర్సు వేడుకలు | - | Sakshi
Sakshi News home page

వైభవంగా బేతంపూడి ఉర్సు వేడుకలు

Apr 11 2026 8:10 AM | Updated on Apr 11 2026 8:10 AM

టేకులపల్లి: మండలంలోని బేతంపూడి హజరత్‌ సయ్యద్‌ జమాలుద్దీన్‌ బిహారీ బాబా దర్గా ఉర్సు వేడుకలు శుక్రవారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉర్సు కమిటీ ఆధ్వర్యంలో దర్గా ఆవరణ మొత్తం విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే కాకుండా ఏపీ నుంచి కూడా భక్తులు ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చారు. రాత్రి 8 గంటలకు కొత్తగూడెంలోని సూపర్‌బజార్‌కు చెందిన సి.మాలిక్‌ నివాసం నుంచి గంధాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి, దర్గాలో సమర్పించారు. ఢిల్లీకి చెందిన ప్రముఖ కళాకారుడు నుస్రత్‌ ఆలీ జహంకార్‌ ఖవ్వాలి కార్యక్రమం ఆకట్టుకుంది. ది పిరమిడ్‌ స్పిరిచ్యువల్‌ సొసైటీస్‌ మూవ్‌మెంట్‌ ఆధ్వర్యంలో శాకాహారం ప్రయోజనాలను తెలియజేస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. సీఐ బత్తుల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు రాజేందర్‌,శ్రీనివాస్‌రెడ్డి, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కుల, మతాలకతీతంగా భారీగా తరలివచ్చిన భక్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement