ఆకలితో బిర్యానీ కోసం వెళ్తే.. చాలా దారుణంగా.. | - | Sakshi
Sakshi News home page

ఆకలితో బిర్యానీ కోసం వెళ్తే.. చాలా దారుణంగా..

Aug 12 2023 12:12 AM | Updated on Aug 12 2023 1:54 PM

- - Sakshi

భద్రాద్రి: ఆకలితో ఉన్న వారు రెస్టారెంట్‌కు వెళ్తే బిర్యానీతో పాటు పెరుగు పురుగులు రావడంతో ఆందోళనకు దిగారు. టేకులపల్లికి చెందిన లక్ష్మణ్‌రావు, సురేశ్‌, రమేశ్‌ కొత్తగూడెంలోని ఆర్‌టీఓ కార్యాలయానికి వచ్చి పనిముగిశాక కొత్తగూడెం సెవెన్‌హిల్స్‌ ఏరియాలోని రెస్టారెంట్‌కు వెళ్లారు.

ముగ్గురు బిర్యానీ తీసుకుని తినే క్రమాన బిర్యానీతో పాటు పెరుగులోనూ చిన్నచిన్న పురుగులు కనిపించడంతో సిబ్బందిని ప్రశ్నించారు. అయితే, వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో నిలదీశారు. పోలీసులు చేరుకుని వివరాలను సేకరించారు. ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ వచ్చి తనిఖీలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement