భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలో మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకా లం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి మిథిలా స్టేడియం ప్రాంగణంలో ఉన్న శ్రీరామా సేవా మండపంలో ఉత్సవ మూర్తులకు కొలువుదీర్చారు. స్వా మివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశా రు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.
కేటీఎస్ యాప్ ఆవిష్కరణ
దమ్మపేట: దమ్మపేట మండల యువకులు ప్రారంభించిన స్టార్టప్ కంపెనీ నిటాల్ జీఎస్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో రూపొందించిన కేటీఎస్ రైడ్ సర్వీస్ యాప్‌ను శనివారం ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ (తహసీల్దార్) మద్దినేని ముర ళి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ గ్రామీణ ప్రాంతాల నుంచి యువ పారి శ్రామికవేత్తలు రావడం హర్షణీయమని అన్నా రు. యాప్ రూపకర్తలు జల్లిపల్లి సత్యగౌతమ్, చవ్వ సాయిరామకృష్ణ మాట్లాడుతూ ఓలా, ఉబర్ తరహాలో గ్రామీణ ప్రయాణికుల కోసం యాప్ రూపొందించినట్టు తెలిపారు.
కిన్నెరసానిలో సందడి
పాల్వంచరూరల్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో పర్యాటకులు కోలాహలం కనిపించింది. వివిధ జిల్లాల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. డీర్ పార్కులోని దుప్పులను, డ్యామ్‌పైనుంచి జలాశయాన్ని వీక్షించారు. అనంతరం బోటు షికారు చేశారు. 641 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా రూ.30,870 ఆదాయం, సఫారీ వాహనాల ద్వారా రూ.10,400 లభించినట్లు వైల్డ్‌లైఫ్ సిబ్బంది తెలిపారు. 440 మంది బోటింగ్ చేయగా రూ.22,310 ఆదాయం టూరిజం శాఖకు లభించినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
తాలిపేరుకు వరద ఉధృతి
చర్ల: ఛత్తీస్‌గఢ్, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి కొనసాగుతోంది. శనివారం 6 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి ఉంచి 8,601 క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా, 73.95 మీటర్ల వద్ద క్రమబద్ధీకరిస్తున్నారు. కుడి కాలువ ద్వారా 25 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 210 క్యూసెక్కుల చొప్పున పంట పొలాలలకు సాగునీటిని విడుదల చేస్తున్నారు.
కారేపల్లి వాసికి శౌర్యపతకం
కారేపల్లి: మండలంలోని భల్లునగర్‌తండా గ్రామ వాసి, గ్రేహౌండ్స్ ఆర్‌ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న బానోతు సురేందర్‌కు విధినిర్వహణలో ప్రతిభకు గాను శౌర్య పతకం లభించింది. హైదరాబాద్‌లో శనివారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో ఆయనకు గ్రేహౌండ్స్ డీజీపీ అనిల్‌కుమార్ పతకం అందజేశారు.


