ప్రొటోకాల్‌ కూడా పాటించరా? | - | Sakshi
Sakshi News home page

ప్రొటోకాల్‌ కూడా పాటించరా?

Jul 1 2023 1:02 AM | Updated on Jul 1 2023 1:02 PM

- - Sakshi

పాల్వంచరూరల్‌: పట్టణంలోని ఇరుకైన గల్లీలో ఉన్న సుగుణ గార్డెన్స్‌లో శుక్రవారం పోడుపట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావుతోపాటు ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్‌ కాన్వాయ్‌ వాహనాలను ఒక మార్గంలో పోలీసులు అనుమతించారు.

మిగిలిన వాహనాలను మరో మార్గంవైపు దారి మళ్లిస్తుండగా మంత్రి వెనుక కాన్వాయ్‌లో వచ్చిన అశ్వారావుపేట ఎమ్మెల్యే ఎం.నాగేశ్వరరావు, గ్రంథాలయ చైర్మన్‌ దిండిగాల రాజేందర్‌ వాహనాలను ఎస్‌ఐలు శ్రీనివాస్‌, నరేశ్‌ నిలిపివేశారు. అన్ని వాహనాలు అటువైపు వెళ్తే ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతుందని దారి మళ్లిస్తుందగా రాజేందర్‌ వాహనం దిగి ప్రజాప్రతినిధుల ప్రొటోకాల్‌ను కూడా పాటించరా? అంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో పట్టణ ఎస్‌ఐ వాహనాలను ఆ మార్గంలో వెళ్లేందుకు అనుమతిలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement