ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ వేగవంతం చేయాలి

Aug 26 2026 1:54 AM | Updated on Aug 26 2026 1:54 AM

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ వేగవంతం చేయాలి చీరాల రూరల్‌: ప్రభుత్వాసుపత్రికి వచ్చే నిరుపేద రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ వైద్యులు, వైద్య సిబ్బందికి సూచించారు. చీరాల ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని అత్యవసర విభాగంతోపాటు చిన్న పిల్లల వార్డులను పరిశీలించారు. రోగులకు ఏవిధంగా వైద్య సేవలందిస్తున్నారనే విషయమై ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్‌ సుభాషిణి, ఇతర వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది వైద్య సేవలు ఏవిధంగా అందిస్తున్నారనే విషయాన్ని వారు రోగులను అడిగి తెలుసుకున్నారు. రూ. 23 కోట్లతో నిర్మితమైవుతున్న క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రి నిర్మాణ పనులను, ఆస్పత్రి ప్రాంగణంలో నిర్మిస్తున్న సీసీ రోడ్ల పనులను కూడా వారు నిశితంగా పరిశీలించారు. మంచి నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. వారు మాట్లాడుతూ చీరాల ప్రభుత్వాసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే అత్యవసర వైద్యసేలు మరింత మెరుగుపడతాయని వారు పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

చీరాల: సంక్షిప్త ఓటర్ల సవరణ జాబితా ప్రక్రియలో చివరి దశను వేగవంతం చేయాలని కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ సూచించారు. మంగళవారం చీరాల మున్సిపల్‌ కార్యాలయంలో వీడియా కాన్ఫరెన్స్‌ హాలులో ఎన్నికలు, 22 ఎ, ప్రజాభిప్రాయ సేకరణ నివేదికలపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. జిల్లాలో 48 మంది ఈఆర్‌ఓ, ఏఈఆర్వోలు ఉన్నారన్నారు. వారి లాగిన్‌లో ఉన్న దరఖాస్తులను పూర్తి చేసేందుకు ఉదయం, రాత్రి ఇద్దరు చొప్పున విధులు కేటాయిస్తూ వారికి శిక్షణ ఇచ్చి లాగిన్‌లో ఉన్న దరఖాస్తులను పూర్తి చేయాలన్నారు. కులం, జన్మస్థలం, పుట్టుక ధ్రువీకరణ పత్రాలు బాగా ఉపయోగపడతాయని, దరఖాస్తుదారుల వద్ద నుంచి వాటిని సేకరించాలన్నారు. నోటీసులు జారీ, హియరింగ్‌లకు సంబంధించి ఏఈఆర్‌ఓలు, బీఎల్‌ఓల వారీగా పెండింగ్‌ వివరాలను నివేదికల ద్వారా పరిశీలించారు. పెండింగ్‌కు గల కారణాలపై ఆయన సంబంధిత అధికారులను ఆరా తీశారు. ఫారాల పంపిణీలో పెండింగ్‌కు గల కారణాలపై ఆయన పరిశీలన చేశారు. ఓటర్ల సవరణలో ఏమైనా సందేహాలు, సమస్యలు ఉంటే వాటిని వెంటనే నివృత్తి చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఆర్‌ఓఆర్‌ సర్వేపై నిర్వహించిన ఐవీఆర్‌ఎస్‌ ప్రజాభిప్రాయ సేకరణ నివేదికపై కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఆర్‌ఓఆర్‌ సర్వేపై రాష్ట్ర ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిందన్నారు. సేకరణలో ఫోన్‌ కాల్స్‌ ద్వారా ప్రజలను నాలుగు అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేసినట్లు ఆయన తెలిపారు. ప్రజాభిప్రాయంలో వంద శాతం ప్రతికూలత వ్యక్తపరచిన ఆయా గ్రామాల వీఆర్వోలను ఆయన ఆరా తీశారు. మండలాల వారీగా ఆర్డీఓలను పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఎక్కడైతే తేడా ఉంటుందో ఆ గ్రామాల్లో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.

పోలింగ్‌ కేంద్రం పరిశీలన...

మంగళవారం పేరాల హరిప్రసాద్‌నగర్‌లోని ఆర్కే ఓరియంటల్‌ స్కూల్‌లోని 95వ పోలింగ్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓటరు జాబితా పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రం పరిధిలో గైర్హాజరు, ఇల్లు మారడం, మరణాల జాబితా, నోటీసుల జారీ, హియరింగ్‌ దరఖాస్తులపై బీఎల్‌ఓను ఆరా తీశారు. హియరింగ్‌ ప్రక్రియను ఒక ప్రణాళిక ప్రకారం వేగంగా పూర్తి చేయాలని ఏఈఆర్‌ఓ, బీఎల్‌ఓకు సూచించారు. చీరాల ఆర్డీఓ నరసింహారావు, మున్సిపల్‌ కమిషనర్‌ డేనియల్‌ జోసఫ్‌, తహసీల్దార్‌ గోపీకృష్ణ, వీడియో కాన్ఫరెన్స్‌లో ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి లవన్న, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, వీఆర్వోలు, బీఎల్‌ఓలు పాల్గొన్నారు.

రోగులకు మెరుగైన వైద్య సేవలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement