డాక్టర్‌ కిషోర్‌ కుమార్‌కు అవార్డు | - | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ కిషోర్‌ కుమార్‌కు అవార్డు

Aug 26 2026 1:54 AM | Updated on Aug 26 2026 1:54 AM

డాక్టర్‌ కిషోర్‌ కుమార్‌కు అవార్డు ఎల్‌నినోతో రైతులు అప్రమత్తంగా ఉండాలి తైక్వాండో పోటీల్లో గుంటూరు క్రీడాకారుల ప్రతిభ బడ్జెట్‌ పాఠశాలలకు ప్రభుత్వం చేయూత ఇవ్వాలి

మార్టూరు: మార్టూరులోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో జనరల్‌ సర్జన్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ గారపాటి కిషోర్కుమార్‌ బెస్ట్‌ సర్జన్‌గా మంగళవారం బాపట్లలో కలెక్టర్‌ వి.వినోద్కుమార్‌ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. గత రెండు సంవత్సరాల కాలంలో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో 900కు పైగా శస్త్ర చికిత్సలు చేసి అరుదైన ఘనత సాధించిన సందర్భంగా కిషోర్‌ కుమార్‌ ఈ పురస్కారం అందుకున్నారు. కలెక్టర్‌ వినోద్కుమార్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు రికార్డు స్థాయిలో శస్త్ర చికిత్సలు నిర్వహించి వైద్య సేవలు అందించడం అభినందనీయమని కొనియాడారు. ఇలాంటి వైద్యుల వలన ప్రభుత్వాసుపత్రులపై రోగులకు మరింత నమ్మకం పెరుగుతుందన్నారు. కిషోర్‌ కుమార్‌తో పాటు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో సీనియర్‌ ఫార్మసిస్ట్‌ విధులు నిర్వహిస్తున్న ఎన్‌.జ్యోతిర్మయి కూడా ప్రతిభా పురస్కారం అందుకున్నారు. చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, డీఎంఅండ్‌హెచ్‌ఓ పద్మావతి పాల్గొన్నారు.

ఘంటసాల: ఎల్‌నినో ప్రభావంతో సాగు చేస్తున్న రైతులు అప్రమత్తంగా ఉండాలని కేవీకే సమన్వయకర్త డాక్టర్‌ డి.సుధారాణి అన్నారు. వ్యవసాయ శాఖ విజ్ఞాన యాత్రలో భాగంగా గుంటూరు జిల్లాకు చెందిన రైతులు ఘంటసాలలోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శాసీ్త్రయ పద్ధతులు, వివిధ వ్యవసాయ అనుంబంధ కార్యకలాపాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. అనంతరం డాక్టర్‌ సుధారాణి మాట్లాడుతూ కేవీకే విధులు, పనితీరు, విత్తన ఉత్పత్తి, శిక్షణ కార్యక్రమాలు, క్షేత్ర స్థాయి పరిశోధనలు, ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాల గురించి, ఎల్‌నినో ప్రభావం వలన సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తదితర అంశాలపై తెలిపారు. కేవీకే శాస్త్రవేత్తలు వెంకటలక్ష్మి, రేవతి, నవీన్‌, యశ్వంత్‌ కుమార్‌, గుంటూరు మండల ఏవో కిశోర్‌, పెదకాకాని ఏఈవో శివరామ్‌, రైతులు పాల్గొన్నారు.

గుంటూరు వెస్ట్‌(క్రీడలు): శ్రీకాకుళం జిల్లా తైక్వాండో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి నిర్వహించిన అంతర్‌ జిల్లాల తైక్వాండో చాంపియన్‌షిప్‌ 2026 పోటీల్లో గుంటూరు జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరచారని న్యూ ఆంధ్రప్రదేశ్‌ తైక్వాండో అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి బి కాశీనాథ్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. న్యూ ఆంధ్రప్రదేశ్‌ తైక్వాండో అసోసియేషన్‌(నాప్తా) నిర్వహించిందన్నారు. కాశీనాథ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ అకాడమీకి చెందిన క్రీడాకారులు మూడు బంగారు, ఐదు రజత, 17 కాంస్యలతో సహా మొత్తం 25 పతకాలు సాధించారన్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులను న్యూ ఆంధ్రప్రదేశ్‌ తైక్వాండో అసోసియేషన్‌ అధ్యక్షులు అచ్చం నాయుడు, ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ వేణుగోపాలరావు, కోచ్‌లు బి విజయ్‌, బి వెంకట సాయి సుబ్రహ్మణ్యం లను అసోసియేషన్‌ నాయకులు అభినందించి జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందించారన్నారు.

గుంటూరు ఎడ్యుకేషన్‌: పేద, మధ్య తరగతి వర్గాలకు అండగా ఉంటూ సమాజంలో విద్యాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్న బడ్జెట్‌ పాఠశాలలు మనుగడ సాగించే విధంగా ప్రభుత్వం చేయూత అందించాలని ఏపీ ప్రైవేటు స్కూల్స్‌ అసోసియేషన్‌ (అప్సా) రాష్ట్ర కో చైర్మన్‌ మేకల్‌ రవీంద్రబాబు, రాష్ట్ర కోశాధికారి చెరుకూరి శ్రీహరి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం అప్సా ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అప్సా భాగస్వామ్య ప్రైవేటు పాఠశాలలను బైక్‌ ర్యాలీగా వెళ్లి సందర్శించారు. ఈసందర్భంగా ఆయా పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈసందర్భంగా అప్సా రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ బడ్జెట్‌ స్కూల్స్‌ రక్షణకై సంఘటితం కావాలని, ప్రభుత్వాల నుంచి ఎటువంటి సహాయం పొందకుండా, స్వయంకృషితో డిగ్రీలు చేత పట్టుకుని ఎన్నో ఏళ్లుగా చిన్న పాఠశాలలను ఏర్పాటు చేసుకుని, అర్హత గల ఉపాధ్యాయులతో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు పాటించి, పాఠశాలలను నడుపుతున్న పలువురు బడ్జెట్‌ స్కూల్స్‌ నిర్వాహకులు దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారని, వారికి భరోసా కల్పించి, ఐక్యంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించామన్నారు. కార్పొరేట్‌కు దూరంగా తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తూ పేద, బడుగు, బలహీనవర్గాలకు అండగా నిలుస్తున్న సంఘ జిల్లా నాయకులు రాజేష్‌ నాయుడు, భాను ప్రసాద్‌, వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement