మండలి డెప్యూటీ చైర్మన్‌ మాధవరావుకు సన్మానం | - | Sakshi
Sakshi News home page

మండలి డెప్యూటీ చైర్మన్‌ మాధవరావుకు సన్మానం

Aug 26 2026 1:54 AM | Updated on Aug 26 2026 1:54 AM

పెదకూరపాడు: ప్రజా సమస్యలపై గళం వినిపించే నేతను మండలి డెప్యూటీ చైర్మన్‌గా నియమించడం అభినందనీయం అని మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. మంగళవారం గుంటూరులోని మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు స్వగహంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి మండలి డిప్యూటీ చైర్మన్‌ మాధవరావుని ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల వైఎస్సార్‌ సీపీ మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఘనంగా సత్కరించారు. వారు మాట్లాడుతూ శాసనమండలి సభ్యుడిగా వైఎస్సార్‌ సీపీ తరుపున ప్రజా సమస్యలపై తన గళం వినిపించి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లిన తుమాటి మాధవరావుని మండలి డెప్యూటీ చైర్మన్‌గా ఎంపిక చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆయన ప్రజా మన్ననలు పొంది మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్‌, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, చీరాల నియోజకవర్గ సమన్వయకర్త కరణం వెంకటేష్‌, అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర చింతలపూడి అశోక్‌కుమార్‌, ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు, పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి, విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్‌, జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement