ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి
నరసరావుపేట: వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడం సంస్థ ప్రధాన లక్ష్యమని ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పి.పుల్లారెడ్డి పేర్కొన్నారు. పల్నాడు సర్కిల్ పనితీరుపై విజయవాడ కార్పొరేట్ కార్యాలయం నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యుత్ సరఫరా నాణ్యత, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం, రెవెన్యూ వసూళ్లు, లైన్ లాస్ తగ్గింపు, విద్యుత్ భద్రత, నిర్వహణ పనులు, వర్షాకాల అత్యవసర సన్నద్ధత, సబ్‌స్టేషన్లు, పంపిణీ వ్యవస్థ పనితీరు వంటి అంశాలపై సమీక్షించారు. రెవెన్యూ వసూళ్లలో మెరుగైన ఫలితాలు, విద్యుత్ చౌర్యాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో డైరెక్టర్ ఫైనానన్స్ ఎస్.వెంకటేశ్వర్లు, డైరెక్టర్ టెక్నికల్ ఆవుల మురళీకృష్ణయాదవ్, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ టీవీఎస్‌ఎన్ మూర్తి, పల్నాడు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ పి.విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, అధికారులు పాల్గొన్నారు.
తాడికొండ: ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం నుంచి ప్రారంభభమైన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. అసెంబ్లీ భవనం, ప్రవేశ ద్వారాలు, అసెంబ్లీ హాల్, మండలి హాల్, వీఐపీ/వీవీఐపీ మార్గాలు, చెక్‌పోస్టులు తదితర ప్రాంతాల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. బందోబస్తులో భాగంగా డ్రోన్ ఆధారిత నిఘా, అధునాతన సీసీ కెమెరాల పర్యవేక్షణ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంతో పాటు, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ విభాగాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు అప్రమత్తతతో వ్యవహరించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఏటీవీ రవికుమార్, ఎస్బీ డీఎస్పీ, అళహరి శ్రీనివాస్, ఏఆర్ డీఎస్పీ సుంకరయ్య, ఎస్బీ సీఐ మల్లికార్జునరావు, ఏఆర్ ఆర్‌ఐ కృష్ణయ్య పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
వచ్చే నెల 18న గోవాలో ప్రదానం


