బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

Apr 27 2025 1:58 AM | Updated on Apr 27 2025 1:58 AM

బాపట్

బాపట్ల

ఆదివారం శ్రీ 27 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025
యథేచ్ఛగా కూటమి నేతల దందా

సాక్షి ప్రతినిధి,బాపట్ల: పచ్చనేతల అక్రమాలు నేరాలకు దారితీస్తున్నాయి. తద్వారా ఏకంగా హత్యా ఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బాపట్ల పార్లమెంట్‌ పరిధిలోని నాగులుప్పపాడు మండలానికి చెందిన టీడీపీ నేత, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి హత్యకు గురికావడం సంచలనం సృష్టించింది. వీరయ్య చౌదరి హత్యకు రేషన్‌ దందా కార ణం అయివుండవచ్చని అనుమానించిన పోలీసులు ఆ దిశగా విచారణ చేసి కొందరు రేషన్‌ మాఫియా సభ్యులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. బాపట్ల మండలం వెదుళ్లపల్లికి చెందిన రైస్‌ మిల్లు యజమాని సుధీర్‌తోపాటు పొన్నూరుకు చెందిన పలువురు బియ్యం వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. రేషన్‌తోపాటు మద్యం సిండికేట్‌, ఇసుక దందా, ల్యాండ్‌ సెటిల్‌మెంట్లు ఈ హత్యకు కారణమన్న ప్రచారం ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జి ల్లా ల్లో జోరుగా సాగుతోంది. మొత్తంగా అక్రమార్జన, ఆధిపత్య పోరు హత్యకు కారణమని ప్రచారం జరుగుతుంది.

పచ్చనేతల అక్రమాలపై చర్చ

వీరయ్య హత్య ఉదంతం, పచ్చనేతల అక్రమ కార్యకలాపాలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. కూటమి అధికారంలోకి వచ్చాక బాపట్ల జిల్లాలో చౌక బియ్యం దందా జోరుగా సాగుతోంది. పచ్చనేతలకు బియ్యం వ్యాపారం ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ప్రారంభంలో ఒక్కో ఎమ్మెల్యేకు నెలకు రూ.8 నుంచి రూ.10 లక్షలు ఇచ్చిన రేషన్‌ మాఫియా ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.25 లక్షలకు పెంచింది. అంతకుమించిన మొత్తాన్ని మేమిస్తామంటూ ప్రకాశం, బాపట్ల జిల్లాలకు చెందిన మాఫియా పోటీలు పడుతోంది. మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అనుచరులు ఇప్పడు బియ్యం వ్యాపారంలోనూ తమ హవా చాటుతున్నట్లు ప్రచారం వుంది. మాఫియా ఒంగోలు, మద్దిపాడు, సంతమాగులూరుతోపాటు పలు ప్రాంతాల్లో ఏకంగా రైస్‌మిల్లులు లీజుకు తీసుకొని చౌకబియ్యాన్ని రీసైక్లింగ్‌ చేిస్తున్నారు. ఆ తర్వాత కృష్ణపట్నం పోర్టు నుంచి కొంత, గుజరాత్‌కు మరికొంత తరలిస్తున్నారన్నది బహిరంగమే. కిలో బియ్యం రూ.10 నుంచి రూ.12లకు కొని రూ.50 నుంచి రూ.70కి అమ్మి మాఫియా రూ.కోట్లు గడిస్తోంది. దీంతో మాఫియా ఎమ్మెల్యేలు, అధికారులకు అడిగినంత నెల మామూళ్లు చెల్లిస్తోంది.

న్యూస్‌రీల్‌

పోటీలు పడి రేషన్‌ బియ్యం అక్రమ రవాణా నేరాలకు దారి తీస్తున్న కార్యకలాపాలు తాజాగా ఒంగోలులో పచ్చ నేత హత్య జిల్లాలోనూ పతాకస్థాయికి బియ్యం దందా పోటీలు పడుతున్న పచ్చ నేతలు అక్రమాల మాటున నేరాలకు అవకాశం

బాపట్ల1
1/4

బాపట్ల

బాపట్ల2
2/4

బాపట్ల

బాపట్ల3
3/4

బాపట్ల

బాపట్ల4
4/4

బాపట్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement