అట్టహాసంగా పది వేల కమిటీల సంబరాలు
వేమూరు: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో పది వేల కమిటీలను పూర్తి చేసినట్లు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు తెలిపారు. చెరుకుపల్లిలోని నియోజకవర్గ పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం టపాసులు కాల్చి సంబరాలు జరిపారు. పార్టీ శ్రేణులు అశోక్‌బాబును గజమాల, దుశ్శాలువాతో సత్కరించి అభినందించారు. కేక్ కట్ సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో మండల, గ్రామ అనుబంధ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండల, గ్రామ స్థాయి నాయకులు పూర్తిగా సహకరించడం వల్ల 10 వేల కమిటీలను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. నాయకులకు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు దాది సుబ్బారావు, నేతలు పడమటి శ్రీనివాసరావు, అన్నపురెడ్డి రఘురామిరెడ్డి, దాట్ల మోహన్‌రెడ్డి, గాదె శివరామకృష్ణారెడ్డి, పెరికల పద్మారావు, జంగం వాసు, ప్రతాప్ పాల్గొన్నారు.


