రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి
● ఇన్‌చార్జి ఆర్డీఓగా లక్ష్మీప్రసన్న బాధ్యతలు ● నూతన కార్యాలయం ప్రారంభం
అద్దంకి: రెవెన్యూ సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని నూతన రెవెన్యూ డివిజన్ తొలి ఆర్డీఓగా (ఇన్‌చార్జి) నియమితులైన లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ఆమె బుధవారం పట్టణంలోని ఆర్ అండ్ బీ బంగ్లాలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆర్డీఓ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీకరణ లక్ష్యంగా ప్రభుత్వం నూతనంగా అద్దంకిని రెవెన్యూ డివిజన్‌గా చేసిందని చెప్పారు. డివిజన్ పరిధిలో అద్దంకి, దర్శి నియోజకవకవర్గాల్లోని 10 మండలాలుంటాయని తెలిపారు. అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలపడం, రెవెన్యూ డివిజన్‌గా చేయడంతో ప్రజల కల నెరవేరిందని పేర్కొన్నారు. అనంతరం అద్దంకి తహసీల్దార్ శ్రీచరణ్‌తో పాటు, వివిధ మండలాల తహసీల్దార్లు బొకేలతో ఆర్డీఓకు అభినందనలు తెలియజేశారు.


