రేపు మల్లేశ్వరుని సన్నిధిలో శివముక్కోటి పూజలు
పెదకాకాని: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెదకాకాని శ్రీమల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో శనివారం ఆరుద్రోత్సవంశాస్త్రోక్తంగా జరుగుతుందని ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. ఆరుద్రోత్సవం విశిష్టతను దేవస్థాన స్థానాచార్యులు పొత్తూరి సాంబశివరావు వివరిస్తూ ధనుర్మాసంలో వచ్చే ఆరుద్రా నక్షత్రాన ఈశ్వరునికి అరుద్రోత్సవం, తెల్లవారుజామున ఉత్తరద్వార దర్శనం జరుగుతుందన్నారు. దీనినే ఆరుద్రోత్సవం లేదా శివముక్కోటి అని కూడా అంటారని తెలిపారు. తెల్లవారుజామున స్వామి వారికి విఘ్నేశ్వరపూజ, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్ర పంచామృత అన్నాభిషేకం నిర్వహించబడుతుందన్నారు. అనంతరం పూలతో శోభాయమానంగా అలంకరించిన నంది వాహనంపై భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వరస్వామి వార్ల గ్రామోత్సవం జరుగుతుందని తెలిపారు.
గుంటూరు ఎడ్యుకేషన్: జెడ్పీ క్యాంపు కార్యాలయంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీక్రిస్టినా, సురేష్‌కుమార్ దంపతులు నూతన సంవత్సర కేక్ కట్ చేసి, అధికారులతో పాటు ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు, డిప్యూటీ సీఈవో సీహెచ్ కృష్ణ, అకౌంట్స్ అధికారి శామ్యూల్ పాల్, పలువురు ఎంపీడీవోలు, ఉద్యోగులు పాల్గొన్నారు.
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి కొత్తపేట, షరాఫ్‌బజార్ బస్తీలకు సంబంధించి ఈనెల 4న జరగనున్న హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని ఆర్‌ఎస్‌ఎస్, హిందూ చైతన్యవేదిక నాయకులు కోరారు. కార్యక్రమ ఆహ్వానపత్రికను గురువారం ఆవిష్కరించి వివరాలను తెలియజేశారు. బోసురోడ్డులోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో 4వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి హిందూ సమ్మేళనం జరుగనుందని రాష్ట్ర ఆర్‌ఎస్‌ఎస్ మీడియా ప్రముఖ్ అవ్వారు శ్రీనివాసరావు, హిందూ చైతన్య వేదిక జిల్లా సంయోజక్ పొట్టిమూర్తి తెలియజేశారు. హిందూ చైతన్యవేదిక రాష్ట్ర సంయోజక్ పిన్నం వెంగళరావు ప్రధాన వక్తగా, తెనాలికి చెందిన పెండేల వెంకట్రావు, డబుల్‌హార్స్ మినపగుళ్లు అధినేత మునగాల మోహన్‌శ్యాంప్రసాద్ ముఖ్యఅతిథులుగా పాల్గొంటారని తెలిపారు. హిందూ సమ్మేళన నిర్వహణ కమిటీ శ్రీరాం రాజేష్‌బాబు, తాతా శ్రీనివాసరావు పర్యవేక్షించే ఈ సమ్మేళనంలో హిందువులందరూ కుటుంబాలతో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ పట్టణ సంయోజక్ కోట రాజేష్, సహ సంయోజక్ విజయ్, తెనాలి పట్టణ ఐక్యవేదిక నుంచి వెచ్చా శ్యామ్, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
మంగళగిరి టౌన్: నూతన సంవత్సరం సందర్భంగా గురువారం మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. తెల్లవారుజాము నుంచి దిగువ, ఎగువ సన్నిధి ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించి, నూతన సంవత్సరంలో మంచి జరగాలని కోరుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈఓ సునీల్‌కుమార్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
రేపు మల్లేశ్వరుని సన్నిధిలో శివముక్కోటి పూజలు
రేపు మల్లేశ్వరుని సన్నిధిలో శివముక్కోటి పూజలు
రేపు మల్లేశ్వరుని సన్నిధిలో శివముక్కోటి పూజలు


