ఘర్షణలో కొడవలితో దాడి
క్రోసూరు: క్రోసూరు నాలుగురోడ్ల సెంటర్లో జరిగిన ఘర్షణలో కొడవలితో దాడి చేయటంతో ఒకరికి తీవ్రగాయలైన సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల మేరకు క్రోసూరుకు చెందిన బైక్ మెకానిక్ షేక్ ఖయ్యుం ద్విచక్ర వాహనంపై అమరావతి రోడ్డు వైపుగా వెళ్తుండగా, అటు నుంచి అనంతవరం గ్రామానికి చెందిన దేవరాజు అనే వ్యక్తి తన ఆటోతో వస్తున్న క్రమంలో ఒకరి వాహనం ఒకరికి తగిలింది. దీంతో అక్కడ వాదోపవాదాలు జరిగాయి. అయితే తిరిగి కొద్ది సేపటికి ఖయ్యుం తన స్నేహితులతో కలిసి వచ్చి నాలుగురోడ్ల సెంటర్‌లో నిలుచుని ఉన్న ఆటో డ్రైవర్ దేవరాజుపై తిరిగి వాదనకు దిగి ఘర్షణ పడ్డారు. ఈక్రమంలో ఆటోలో ఉన్న కొడవలితో ఖయ్యుంను కొట్టాడు. ఖయ్యుంకు తీవ్రగాయాలు కాగా వెంటనే సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.


