ద్విచక్ర వాహనాలు ఢీ.. ఇద్దరు మృతి
వెల్దుర్తి: రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొనటంతో ఇరువురు వ్యక్తులు మృతిచెందిన సంఘటన వెల్దుర్తి మండలం శిరిగిరిపాడు గ్రామ సమీపంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే... మాచర్ల పట్టణానికి చెందిన షేక్ కరీముల్లా (50), షేక్ నూర్జహాన్ (45) ద్విచక్రవాహనంపై పండ్లు కొనుగోలు చేసేందుకు మార్కాపురం వెళుతున్నారు. మహేష్ అనే వ్యక్తి శిరిగిరిపాడు నుంచి మాచర్లకు ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. మోపెడ్‌పై ప్రయాణిస్తున్న షేక్ కరిముల్లా అక్కడికక్కడే మృతిచెందాడు. నూర్జహాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను హుటాహుటీన మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ నూర్జహాన్ మృతి చెందింది. వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్ర వాహనాలు ఢీ.. ఇద్దరు మృతి


