జిల్లాలో మామిడి రైతుల కష్టం ఎవరూ తీర్చలేనిది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక...భూగర్బ జలాలు అడుగంటి బోర్లలో నీరు ఇంకిపోతోంది. పైగా వానాకాలంలోనూ వేసవిని మరిపిస్తూ వేడిసెగలు దెబ్బకు చెట్లు రోజురోజుకు క్షీణించిపోతున్నాయి. వాటిని సంరక్షించుకునేందుకు బోర్లలో నీరు లేని రైతులు బాడుగకు ట్యాంకులు పెట్టి నీటిని తోలుకుంటున్నారు. ఒక్కొ ట్యాంకరుకు రూ. 1000 చెల్లించి ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చిన నీటిని ఐదారు చెట్లకు కలిపి రక్షించుకుంటున్నారు. పంట కాపు దేవుడెరుగు..ఎలాగోలా చెట్లను రక్షించుకుంటే చాలనే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే చాలామంది రైతులు ఎక్కడ చూసినా ఇలా వా నాకాలంలోనూ నీటిని తోలుతూ చెట్లను రక్షించుకునేందుకు పాట్లు పడుతున్నారు.


