ఉపాధ్యాయులతో కూటమి ఆటలు | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయులతో కూటమి ఆటలు

Aug 17 2026 1:53 AM | Updated on Aug 17 2026 1:53 AM

పులివెందుల రూరల్‌ : డీఎస్సీ అక్రమాలను కప్పి పుచ్చుకునేందుకు టీచర్లపై సస్పెన్షన్‌ వేటు వేశారని, ఉపాధ్యాయ మనోభావాలతో కూటమి సర్కార్‌ ఆటలాడుతోందని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన భాకారాపురంలోని తన నివాసంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు వైఖరిపై టీచర్లు చేసే పోరాటానికి వైఎస్సార్‌ సీపీ మద్దతుగా ఉంటుందన్నారు. తన కొడుకు లోకేష్‌ డీఎస్సీలో పాల్పడిన అవి నీతి అక్రమాలను కప్పి పుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం డైవర్షన్‌ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.

అంతకుముందు పులివెందుల మున్సిపాలిటీ పరిధి లో ఉన్న విన్నవారిపల్లె గ్రామ సమీపంలోని వెల్లమ్మవారిపల్లె చెరువుకు నీరందించాలని గ్రామస్తులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆయన అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే అక్కడికొచ్చిన ప్రజల నుంచి ఎంపీ వినతులు స్వీకరించారు.

ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement