లారీ ఢీకొని యువకుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని యువకుడి దుర్మరణం

Aug 16 2026 5:21 AM | Updated on Aug 16 2026 5:21 AM

ములకలచెరువు : లారీ ఢీకొనడంతో ఓ యువకుడు దుర్మరణం చెందిన సంఘటన శుక్రవారం రాత్రి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు... మండలంలోని వేపూరికోట పంచాయతీ పెద్దపల్లెకు చెందిన గణేష్‌కుమార్‌(23) పనుల మీద వేపూరికోటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వెళ్తుండగా వెనకల వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన అతను సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని మదనపల్లి ప్రభుత్వ హాస్పిటల్‌ తరలించారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. లారీ, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఉమామహేశ్వర్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement