వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు బలవన్మరణం

Aug 16 2026 5:09 AM | Updated on Aug 16 2026 5:09 AM

మదనపల్లె టౌన్‌ : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు బలవన్మరణం చెందారు. మదనపల్లి మండలంలో ఓ దివ్యాంగుడు కుటుంబ సమస్యల కారణంగా శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని చీకిలబైలు పంచాయతీ రమణయ్య కుమారుడు సదాశివ(53)కు ఏం కష్టం వచ్చిందో ఏమో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పొరుగింటి వారు గమనించి బాధితుడిని ఉరి నుంచి తప్పించి వెంటనే చికిత్సల నిమిత్తం మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం వెంటనే తిరుపతి రుయాకు వెళ్లాలని రెఫర్‌ చేశారు. కుటుంబీకులు బాధితుడిని రుయాకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

అనారోగ్యంతో..

కేవీపల్లె : అనారోగ్యంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని ఎంవీపల్లె పంచాయతీ చెరువుముందరపల్లెలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా వున్నాయి. చెరువుముందరపల్లెకు చెందిన పవన్‌కుమార్‌(29 కొంత కాలంగా అనారోగ్యంతో బాధడుతున్నాడు. తల్లి ఉమ పీలేరులోని కుమార్తె ఇంటికి వెళ్లడంతో.. ఇంటిలో ఒక్కడే ఉన్న పవన్‌కుమార్‌ రెండు రోజుల క్రితం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండు రోజులుగా తలుపులు వేసి ఉండడంతో గ్రామస్తులు అనుమానంతో కిటికీలో నుంచి చూడగా పవన్‌కుమార్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. తల్లి ఉమ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ వెంకటస్వామి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement