కడప సెవెన్ రోడ్స్ : నాటి కడప జిల్లాకు చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, కడప కోటిరెడ్డి, సుండుపల్లె ఆదినారాయణరెడ్డి లాంటి ఎంతో మంది సమరయోధుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అనుభవిస్తున్నామని జిల్లా పరిషత్ చైర్మన్ ముత్యాల రామ గోవిందరెడ్డి అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలను నిర్వహించి ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన త్యాగమూర్తులను స్మరించుకోవాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సుబ్రమణ్యం, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
యోగివేమన విశ్వవిద్యాలయంలో..
కడప ఎడ్యుకేషన్ : యోగివేమన విశ్వవిద్యాలయం(వైవీయూ)లో జాతీయ జెండాను వీసీ బెల్లంకొండ రాజశేఖర్ ఎగురవేసి, వందేమాతరం, జనగణమన గీతాలను ఆలపించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో రిజిస్ట్రార్ పి పద్మ, ప్రిన్సిపల్ టి శ్రీనివాస్, వ్యాయామ విద్య క్రీడా శాస్త్రాల విభాగాధిపతి రామ సుబ్బారెడ్డి, ప్రొద్దుటూరు లేపాక్షి డిగ్రీ కళాశాల పురుషుల, మహిళల స్కౌట్స్, గైడ్స్ బృందం శిక్షకురాలు నజ్మా, వివిధ విభాగాల డీన్లు, ప్రొఫెసర్లు, బోధన బోధనేతర సిబ్బంది, వైవీయూ సెక్యూరిటీ బృందం పాల్గొన్నారు.
జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి


