అయ్యప్పస్వామి ఆలయంలో ఎంపీ విశేష పూజలు | - | Sakshi
Sakshi News home page

అయ్యప్పస్వామి ఆలయంలో ఎంపీ విశేష పూజలు

Aug 16 2026 5:21 AM | Updated on Aug 16 2026 5:21 AM

ప్రతిభకు ప్రశంస

సాక్షి, మదనపల్లె : విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం మొత్తం 529 మంది జిల్లా, మండల స్థాయి అధికారులు, గ్రామ, సచివాలయ ఉద్యోగులు, కార్యాలయాల సిబ్బందికి అవార్డులు అందించారు. ఇందులో 21 మంది జిల్లా అధికారులు ఉన్నారు. వారిలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ (కేఆర్‌ఆర్సీ), డీఎస్‌ఓ రెడ్డిచంద్రిక, ఏపీసీ అనురాధ, జలవనరులశాఖ ఎస్‌ఈ వెంకట్రామయ్య, పశువర్ధకశాఖ అధికారి గుణశేఖర్‌ పిళ్లై, జీఎస్టీ అసిస్టెంట్‌ కమిషనర్‌ చిరంజీవి, డీటీఓ ప్రతాప్‌, మైన్స్‌ ఏడీ రంగకుమార్‌, ఎస్టీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ తేజస్విని, సాంఘిక సంక్షేమ అధికారి దామోదర్‌ రెడ్డి, గ్రామ, వార్డు సచివాలయ అధికారి అమర్నాథ్‌రెడ్డి, ఏపీఎంఐపీ పీడీ లక్ష్మీప్రసన్న, డీహెచ్‌ఓ సుభాషిణి, ఎకై ్సజ్‌ ఈఎస్‌ మధుసూదన్‌, డిస్కం ఎస్‌ఈ సోమశేఖర్‌రెడ్డి, డ్వామా పీడీ వెంకటరత్నం, సీపీఓ వెంకటపెద్దయ్య, ఆర్‌అండ్‌బీ ఈఈ అరవిందాదేవి, డీపీఓ రాధమ్మ, హౌసింగ్‌ పీడీ రమేష్‌రెడ్డి, డీటీఓ నాగభూషణం, సమాచారశాఖ బి.హరినాథ్‌నాయక్‌ ప్రశంసా పత్రాలను మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, ఇన్‌చార్జి కలెక్టర్‌ శివ్‌ నారాయణ్‌ శర్మ చేతుల మీదుగా అందుకున్నారు. వీరితోపాటు తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది ప్రతిభా ప్రశంసా పత్రాలు అందుకున్నారు.

సదుం : మండలంలోని ఎర్రాతివారిపల్లె కోటమలై అయ్యప్పస్వామి ఆలయాన్ని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి శనివారం సందర్శించారు. ఆయన తిరుపతిలో మాలధారణ చేసి అయ్యప్పదీక్షను చేపట్టారు. అనంతరం ఇక్కడికి వచ్చి ఆలయంలోని వినాయక, ఆంజనేయ, నాగమల్లేశ్వరస్వామి ఆలయాలలో పూజలు చేశారు. అయ్యప్పస్వామిని దర్శించుకున్న ఆయనకు అర్చకులు తీర్థ, ప్రసాదాలను అందజేశారు. పలువురు వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కలిశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్‌రెడ్డి, వల్లివేడు పృథ్వీరెడ్డి, అమర్నాథ్‌ రెడ్డి, మిద్దంటి కిశోర్‌, ఐటీ వింగ్‌ జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్‌రెడ్డి, మండల కన్వీనర్‌ రెడ్డెప్పరెడ్డి, వైస్‌ ఎంపీపీ ధనుంజయరెడ్డి, రెడ్డెప్ప రెడ్డి, పుట్రాజు, రత్నశేఖర్‌రెడ్డి, చక్రధర్‌, ఇందాద్‌, గిరిధర్‌రెడ్డి, దాము, సూర్యనారాయణరెడ్డి, మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

17న ఎంపీ పర్యటన

మండల కేంద్రంలో ఎంపీ మిథున్‌రెడ్డి ఈనెల 17న పర్యటిస్తారని జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్‌రెడ్డి, ఐటీ వింగ్‌ జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్‌రెడ్డి, మండల కన్వీనర్‌ రెడ్డెప్పరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు ఉదయం 9 గంటలకు సుబ్రమణ్యస్వామి ఆలయంలో పూజల్లో పాల్గొంటారన్నారు. కలికిరి రోడ్డు నుంచి పంచాయతీ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహిస్తారని పేర్కొన్నారు. పంచాయతీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని, సమస్యలపై వినతులు స్వీకరిస్తారని వివరించారు.

జిల్లాలో 529 మంది అధికారులు, సిబ్బందికి పత్రాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement