కుంచెం కళాపోషణతో.. జీవితం అందమైన చిత్రం! | - | Sakshi
Sakshi News home page

కుంచెం కళాపోషణతో.. జీవితం అందమైన చిత్రం!

Aug 9 2026 2:04 AM | Updated on Aug 9 2026 2:04 AM

మనిషి జీవితం ఉరుకుల పరుగులమయం..

కోర్సు ముగిశాక కొలువు కోసం ఆరాటం..

‘కొలువు’దీరాక బతుకు పోరాటం.. ఈ సంఘర్షణలకు చెక్‌పెడుతూ బీఎఫ్‌ఏ కోర్సు విద్యార్థి ముంగిటకొచ్చి వాలింది. మనిషిలో కాసింత కళాపోషణ ఉంటే..

సృజనతో కుంచె కదిలిస్తే జీవితం అందమైన

చిత్రమవుతుంది. కోర్సులో ప్రవేశానికి వైవీయూ రారమ్మని స్వాగతిస్తోంది.

నాలుగేళ్ల బీఎఫ్‌ఏ కోర్స్‌లో ప్రవేశానికి దరఖాస్తులు

ఉపాధి అవకాశాలు పుష్కలం

కడప ఎడ్యుకేషన్‌ : యోగి వేమన యూనివర్సిటీలో లలిత కళల విద్యా (బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌) నాలుగు సంవత్సరాల కోర్సుకు ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ప్రారంభంలోనే ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌కి వెళ్ల్లకుండానే అధిక వేతనాలతో ఉద్యోగ అవకాశాలు తలుపుతడగాయి. ముఖ్యంగా ఈ కోర్సు విజయవంతంగా పూర్తి చేస్తే ప్రొఫెషనల్‌ చిత్రాకారుడిగా, ఇంటీరియర్‌ డిజైన్‌, పిల్లల బొమ్మల తయారీ,టీవీ, సినిమా రంగాలలో విస్త్తృత అవకాశాలు ఉన్నాయి. అంతేకాక కేంద్రీయ విద్యాలయా, నవోదయ స్కూళ్లలో అధ్యాపకుడిగా కొలువుదీరే అవకాశం ఉంది. ఇక విగ్రహాలు తయారీ, పార్క్‌ డిజైన్‌, మ్యూజియంలలో జాబ్‌లు ఉన్నాయి. గందరగోళంగా మారుతున్న నేటి సమాజంలో మానసిక సంతోషంతో పాటు మెరుగైన జీతం వచ్చే ఈ కోర్సుకు ఆదరణ పెరుగుతోంది. ఇంటర్‌ లేదా డిప్లమో పూర్తి చేసిన వారు ఈ నాలుగేళ్ల బీఎఫ్‌ఏ కోర్స్‌లో ప్రవేశానికి అర్హులు. ఈ నెల 11వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలి. ఈ విభాగంలో జాయిన్‌ కావాలంటే, ఆసక్తి, అర్హత గల వారు ఓఏఎండీసీ వెబ్‌ సైటు, cets.apche.ap.gov.in లేదా www.yvu.edu.in లలో రిజిస్టర్‌ చేసుకోవచ్చు. ఇతర సమాచారం కోసం 9492345419 నంబర్‌ను సంప్రదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement