వేంపల్లె: ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో నాలుగో విడత అడ్మిషన్ల కౌన్సెలింగ్ శనివారం విజయవంతంగా పూర్తయినట్లు క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ్ ప్రకాష్ తెలిపారు. ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోని సెంట్రల్ లైబ్రరీలో మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం ఈ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ పరిధిలోని ఖాళీలకు 13 మంది, ఒంగోలు ట్రిపుల్ ఐటీ పరిధికి 142 మంది విద్యార్థులను కౌన్సెలింగ్‌కు పిలిచారు. వీరిలో ఆర్కే వ్యాలీకి సంబంధించి పిలిచిన 13 మంది విద్యార్థులూ హాజరై అడ్మిషన్లు పొందారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సంబంధించిన సీట్ల భర్తీ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఆర్కే వ్యాలీలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు వెనువెంటనే తరగతి గదులు, వసతి గృహాలను కేటాయించామని, వారు అప్పుడే క్లాసులకు కూడా హాజరవుతున్నారని డైరెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రిపుల్ ఐటీ పరిపాలనాధికారి డాక్టర్ పెనుకొండ రవికుమార్, డీన్ అకడమిక్స్ డి.రమేష్ కై లాష్, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ డాక్టర్ జి.వెంకటేష్, పీఆర్‌ఓ డాక్టర్ తిరుపతిరెడ్డి, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.


