నాలుగు ఎకరాల్లో వేరుశేనగ సాగు చేశా. విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులకు ఒకటిన్నర లక్ష ఖర్చయింది. వర్షాలు లేక చేతికి గింజ కూడా దక్కదు. పశువుల మేతకు కూడా దక్కని దయనీయ పరిస్థితి ఇప్పుడొచ్చింది. టమాటాకు ధరలేక పంట పోయింది. రైతులకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. తీవ్ర నష్టాలను భరించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.
– కేశవరెడ్డి, వేరుశెనగ రైతు, ములకలచెరువు
రూ.6 లక్షలు ఖర్చుపెట్టి మూడు ఎకరాల్లో టమాటా సాగు చేశా. పంట వేసిన తొలి రోజుల్లో ధర పలికింది. అప్పట్లకే బోరులో నీళ్లు తగ్గిపోయాయి. రీబోరు కూడా వేయించా. కొన్నాళ్లు నీళ్లు వచ్చి మళ్లీ నిలిచిపోయాయి. కళ్లముందే పచ్చని పంట వాడి ఎండిపోయింది. పెట్టిన పెట్టుబడిలో సగం కూడా రాలేదు. నష్టాలను భరించాల్సి వస్తోంది. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి.
– శివరామిరెడ్డి, టమాట రైతు, తంబళ్లపల్లి


