71 పల్లెల్లో నీటి కష్టాలు.. రాయచోటిపై అధిక ప్రభావం | - | Sakshi
Sakshi News home page

71 పల్లెల్లో నీటి కష్టాలు.. రాయచోటిపై అధిక ప్రభావం

Jul 19 2026 1:26 AM | Updated on Jul 19 2026 1:26 AM

జిల్లాలో తాగునీటి సంక్షోభం ఏప్రిల్‌ నుంచే మొదలైంది. ప్రస్తుతం 71 పల్లెల్లో పరిస్థితి తీవ్రంగా మారడంతో గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు ట్యాంకర్లు, ప్రైవేట్‌ బోర్ల టైఅప్‌ ద్వారా నీటిని రవాణా చేస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి ఈ మండలాల్లోని మరో 32 పల్లెల్లో నీటి సమస్య వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ జల సంక్షోభ ప్రభావం రాయచోటి నియోజకవర్గంపై ఎక్కువగా కనిపిస్తోంది. ఇక్కడ భూగర్భజల మట్టం కొంత ఊరటనిచ్చినా, భౌగోళిక పరిస్థితుల వల్ల తాగునీటి సమస్యలు ఇక్కడే అధికంగా ఉన్నాయి. ఆగస్టులోనూ వర్షాలు కురవకపోతే జిల్లావ్యాప్తంగా సాగు, తాగునీటి రంగాలు పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement