పెద్దేరు ప్రాజెక్టు సందర్శన | - | Sakshi
Sakshi News home page

పెద్దేరు ప్రాజెక్టు సందర్శన

Jul 22 2026 1:23 AM | Updated on Jul 22 2026 1:23 AM

తంబళ్లపల్లె : తంబళ్లపల్లె మండలం జుంజురుపెంట సమీపంలోని పెద్దేరు ప్రాజెక్టును మంగళవారం హైడ్రాలజీ అధికారులు సందర్శించారు. హైడ్రాలజీ ఈఈ విజయకుమార్‌, డీఈ సత్యవతి, ఇరిగేషన్‌ డీఈ చెన్నకేశవులు ఏఈ సతీష్‌కుమార్‌, ఆయుకట్టు ఛైర్మన్‌ శివకుమార్‌తో కలిసి ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు గేట్లు పని తీరు, తూములు, కట్ట స్థితి, లాక్‌లు, నీటిమట్టం, లీకేజీలు, కాలువలు, రెయిన్‌గన్‌, గ్యాలరీ అంశాలనుపరిశీలించారు. ప్రాజెక్టు గురించి వివరాలను ఏఈ, చైర్మన్‌లను అడిగి తెలుసుకున్నారు. త్వరలో పెద్దేరు ప్రాజెక్టును కేంద్ర బృందం పరిశీలించనుందని ఏఈ తెలిపారు. లష్కర్‌ శ్రీనివాసులు, ఆయకట్టు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఏఐ–ఎంఎల్‌తో విప్లవాత్మక మార్పులు

కురబలకోట : ప్రపంచ వ్యాప్తంగా విప్లవాత్మక మార్పులకు దారి తీస్తున్న ఏఐలో నైపుణ్యం సాధించి భవిష్యత్తును ఉన్నతంగా నిర్మించుకోవాలని చైన్నెలోని క్యాప్‌ జెమినీ సంస్థ సీనియర్‌ డెవ్‌ఓప్స్‌ ఇంజినీరు బి.సురేంద్ర రెడ్డి కోరారు. అంగళ్లులోని మిట్స్‌ డీమ్డ్‌ యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్‌, మెషిన్‌ లర్నింగ్‌ ఆపరేషన్స్‌–భవిష్యత్తుకు సిద్దమైన ఇంజినీర్ల నిర్మాణం అంశంపై మంగళవారం ఆయన మాట్లాడుతూ.. సాంకేతిక యుగంలో కేవలం ప్రోగ్రామింగ్‌ పరిజ్ణానం మాత్రమే సరిపోదని, మెషిన్‌ లర్నింగ్‌, డీప్‌ లెర్నింగ్‌, డేటా సైన్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ లాంటి అత్యాధునిక సాంకేతికతల్లోనూ ప్రావీణ్యం సాధించాలన్నారు. నిరంతరం కొత్త సాంకేతికతతో పాటు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను మెరుగుపరచుకుంటే అంతర్జాతీయ స్థాయిలో రాణించవచ్చన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement