● అనంతపురం ఆస్తి పంచాయతీ.. అన్నమయ్య జిల్లాలో ...
● సంబేపల్లె పోలీస్ స్టేషన్ కేంద్రంగా సివిల్ పంచాయతీ సెటిల్ మెంట్స్.
సాక్షి టాస్పోర్ట్స్ : శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక శక్తుల అరాచకాలను అనిచివేయడం, మాదకద్రవ్యాల విక్రయాలను నిలువరించడంతో పాటు ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు పోలీస్ స్టేషన్లనే సెటిల్‌మెంట్ కేంద్రాలుగా మార్చి సివిల్ పంచాయతీలు చేస్తూ రూ.లక్షలు, కోట్ల ఆదాయాలను గడిస్తున్న వైనం చర్చనీయాంశంగా మారింది. కూటమి పాలనలో పోలీసులు వారి విధులను పక్కనబెట్టి అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులు వత్తుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రతి పక్షపార్టీలకు చెందిన వారిపై అధికార పార్టీ నేతలు ఆదేశించినదే తడువుగా అక్రమ కేలసు పెట్టి వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. ఇలాంటి పరిస్థితుల్లో రాయచోటి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ట్రిపుల్, డబుల్ స్టార్ల అధికారులు స్టేషన్లనే కేంద్రాలుగా ఏర్పాటు చేసుకొని సివిల్ పంచాయతీలను కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు సోషల్‌మీడియా, వాట్సాప్, దినపత్రికలలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ కోవలోనే అనంతపురం జిల్లా కేంద్రం నడిబొడ్డున కోట్ల రూపాయాల విలువచేసే ఆస్తి విషయమై జిల్లా రాయచోటి రూరల్ పోలీసులు చేసిన పంచాయితీ, కేసు నమోదు రూపంలో నడిపిన దందా ఇటు పోలీసు అటు ప్రజలలో విమర్శలకు తావిస్తోంది. ఈ పంచాయతీ తాము అనుకున్న రీతిలో దారికి రాకపోవడంతో రాయచోటి రూరల్ స్టేషన్ పరిధిలోని సంబేపల్లె పోలీస్ ఠాణాలో కేసు నమోదు చేసి తమదైన రీతిలో బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. తమ వద్దకు వచ్చిన వారికి అండగా రాయచోటి పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో క్రిమినల్ కట్టు కథను అల్లి ప్రత్యర్థిపై కేసులు నమోదు చేసి బెదిరింపులకు దిగిన సంఘటన పోలీస్ వర్గాల్లో సంచలనం రేపుతోంది. వివరాలలోకి వెలితే... అనంతపురం పట్టణానికి చెందిన నిస్సార్‌అహమ్మద్ (డ్రైవర్) అనే వ్యక్తి తనకు వారసత్వంగా వచ్చిన రూ. కోట్ల (8.5సెంట్లు) ఆస్తిని వదిలి కూలీపనుల చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నిస్సార్ అహమ్మద్ అమాయకత్వాన్ని పసిగట్టిన కడప జిల్లా ప్రొద్దుటూర్‌కు చెందిన షేక్ మహబూబ్‌లాల్ (ట్రాన్స్‌కో కార్యాలయంలో పోలీస్) ఆస్తిపై కన్నేశాడు. క్రమంగా అతనితో పరిచయం పెంచుకున్నాడు అన్ని రికార్ఢులు తయారు చేయించి ఆస్తిని విక్రయిస్తే మంచి డబ్బులు వస్తాయని నమ్మపలికాడు. ఫలితంగా తన పేరుపై 8,5 సెంట్ల ఆస్తిని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తీసుకెళ్లి తన పేరున పవర్ ఆఫ్ పట్టాను చేయించుకున్నాడు. త్వరలోనే భూమిని అమ్మి కోట్లకు అధిపతిని చేస్తానని, దీంతో నీ కష్టాలు తీరుతాయని నమ్మపలికించాడు. పవర్ ఆఫ్ పట్టాను పొందిన పోలీసు మరొకరి పేరున రిజిస్ట్రేషన్ చేయించారు. స్థానికుల ద్వారా తనకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకున్న నిస్సార్ అహ్మద్ పోలీస్ దగ్గరకు వెళ్లి కన్నీరు మున్నీరై విలపించారు. జరగుతున్న ఈ తతంగాన్ని గమనించిన ఒక మహిళ వీరిద్దరి నుంచి ఆస్తిని ఎలా కాజేయాలన్న విషయంపై ఆలోచించి నిషార్ అహమ్మద్ తో కలిసి రాయచోటి రూరల్ సీఐని ఆశ్రయించారు. ఈ పంచాయతీ చేస్తే కోట్ల రూపాయలు సమకూరుతుందన్న ఆశతో ఆయన తనకున్న మేధాశక్తిని, అధికారాన్ని ఉపయోగించారు. పవర్ ఆఫ్ పట్టాను పొందిన ప్రొద్దుటూరులోని పోలీసులు పిలిపించి అన్యాయంగా రాయించుకున్న ఆస్తిని తిరిగి రాసివ్వాలని లేక పోతే మీ పై చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించినట్లు సమాచారం.
స్థానిక సీఐ బెదింపులకు లొంగని పోలీసు అక్కడి నుంచి వెల్లి పోయినట్లు సమాచారం. చేసిన పంచాయతీ ఫలించక పోదవడంతో సంబేపల్లె పోలీస్ స్టేషన్‌లో పోలీస్ మహబూబ్ లాల్ తో పాటు మరో 5 గురిపై ఈ నెల 7 వతేదిన సంబేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే మామిడికాయల లోడు కోసం సంబేపల్లె మండల పరిధిలోని శెట్టిపల్లి గ్రామం సమీపంలోకి మామిడికాయల లోడు కోసం లారీ డ్రైవర్‌గా నిస్సార్ వచ్చాడు. నిస్సార్ సంబేపల్లె మండల పరిధిలో ఉన్నారన్న విషయం తెలుసుకుని ప్రొద్దుటూరు పోలీసు తన అనుచరులైన మునాఫ్, ఇనాయత్, మహబూబ్‌లాల్, వహిదాబాను, మహమ్మద్ ఇంతియాజ్, ఎస్‌ఎంబి ఖాజాలు అక్కడికి వచ్చి భయపెట్టడంతో పాటు కత్తితో చంపుతామని బెదిరించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పొందుపరచారు. అలాగే వచ్చిన వారు తనను కొట్టడంతో కిందపడ్డానని కత్తి చూపించి నా మాటను కాదంటే చంపుతామని బెదిరించామని పేర్కొన్నారు. నాదగ్గర ఉన్న పవర్ ఆఫ్ పట్టా లాక్కొని వారి వెంట తెచ్చుకున్న 100 రూపాయల ఖాళీ డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకున్నారని పోలీసులు అల్లిన కథలో ఉంది. ఈ సంఘటన మే 30 వతేదీ జరగగా ఈ నెల7 వ తేదీన కేసు నమోదు చేయడంపై పలు అనుమానాలకు దారి తీస్తోంది. కేసు నమోదుపై తీవ్రంగా స్పందించిన ప్రొద్దుటూరు పోలీస్ రాయచోటి పోలీసులపై చిందులు వేయడంతో పాటు చట్టం తనకూ తెలుసునని తనకు వస్తున్న కోట్ల రూపాయలలో కొంత ఉన్నతాధికారులకు ఖర్చు చేస్తే నాకు ఏమి కాక పోగా మీ ఉద్యోగాలు పోతాయని తిరగబడినట్లు సమాచారం. దీంతో కథ అడ్డం తిరిగిందన్న భయం స్థానిక రాయచోటి రూరల్ పోలీసుల్లో పట్టుకొంది. గుట్టు చప్పుడు కాకుండా జరిగిన ఈ సంఘటన పోలీసులలోనే ఆనోటా..ఈ నోటా ..వ్యాపించి జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలియవచ్చింది. ఈ పంచాయతీ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో పోలీస్‌స్టేషన్‌లు సివిల్ పంచాయతీలకు కేంద్రాలుగా మారతాయని నీతి, నిజాయతీ కలిగిన కొంత మంది పోలీసు అధికారులు వ్యాఖ్యానిసుం్తడటం విశేషం.
సమస్య చేతులు దాటి ఉన్నతాధికారుల చేతుల్లోకి వెళ్లడంతో స్థానిక పోలీసు అధికారులు ఇరువర్గాలతో మాట్లాడి కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలియ వచ్చింది. రాయచోటి కేంద్రంగా జరుగుతున్న రూ.లక్షలు, కోట్ల రూపాయల సివిల్ సంచాయతీల దందా కారణంగా అనేక మంది నిజాయితీ, అసలైన వారు నష్టాలను, కష్టాలను భరించాల్సి వస్తోంది. ఉన్నత స్థాయి పోలీసు అధికారులు స్పందించి నిజాతీ గల అధికారి ద్వారా విచారణ జరిపిస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని స్థానిక ప్రజలు కోరుకొంటున్నారు. ఈ విషయంపై రాయచోటి డీఎస్పీ క్రిష్ణమోహన్‌ను వివరణ కోరగా ఈ విషయం తనకు తెలియదని, విచారించి వారిపై తగుచర్యలు తీసుకుంటామని చెప్పారు.


