బాలికను హత్య చేసిన ఆవుల వెంకటేష్ వెంటనే ఆంజనేయ కొట్టాలుకు వెళ్లాడు. హత్య చేసే సమయంలో వేసుకున్న దుస్తులు తీసేసి పారిపోవడానికి సిద్ధమవుతుండగా పోలీసులు అతన్ని ఆదుపులోకి తీసుకున్నారు. హత్య సమయంలో ఉపయోగించిన ఆయుధంతోపాటు మరి కొన్ని క్లూస్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే బాలిక బంధువులు, తల్లిదండ్రులు స్టేషన్‌కు వస్తారని ముందుగానే గుర్తించి నిందితుడిని మరో స్టేషన్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు. విచారణలో తానే హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.


