అవగాహన కల్పించాలి
అధికారులతో సమీక్షలో
కలెక్టర్ నిశాంత్ కుమార్
మదనపల్లె: వంద రోజుల జలధార ప్రాజెక్టును జిల్లాలో అధికార యంత్రాంగం విజయవంతం చేయాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్ అధికారులను కోరారు. శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్‌ఎస్ హాలులో వందరోజుల కార్యాచరణ ప్రణాళిక అమలకు తీసుకోవాల్సిన చర్యలపై జల వనరులశాఖ, డ్వామా, భూగర్భ జలాలు, సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఏపీడీలు, ఇంజినీరింగ్, ఫీల్డ్ అసిస్టెంట్లతగో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో జలధారకు ముందు పరిస్థితులు, తర్వాత వచ్చిన ఫలితాలు, ప్రస్తుతం తీసుకోవాల్సిన చర్యల గురించి కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లాలో ప్రతి మండలంలో భూగర్భ జలాలు 6 నుంచి 3 మీటర్ల స్థాయికి చేరుకోవడమే అంతిమ లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఇందుకు అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ఫలితాలోస్తాయన్నారు. జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, ఇన్చార్జి డిఆర్‌ఓ చంద్రశేఖర్ రెడ్డి, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఎస్‌ఈ విఠల్ ప్రసాద్, డ్వామా పిడి వెంకటరత్నం, జిఎస్‌డబ్ల్యూఎస్ అధికారి లక్ష్మీపతి, ఆర్డీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
జిల్లాలో 8వ పోషణ పక్వాడ కార్యక్రమాల ద్వారా ఈ నెల 23 వరకు అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ స్థాయిలో పౌష్టికాహారం లోపంపై అవగాహన కల్పించాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లో ఐసీడీఎస్ శాఖ పోషణ పక్వాడ ప్రచార పోస్టర్లను అధికారులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల జననం నుంచి రెండు సంవత్సరాల దశలోనే మెదడు అభివృద్ధిలో 80 శాతం పూర్తవుతుందని తెలిపారు. ఈ సమయంలో సరైన పోషకాహారం, సంరక్షణ చాలా అవసరమని అన్నారు. కార్యక్రమంలో డీడబ్ల్యూసీడబ్ల్యూ ఈఓ కె.హైమావతి, పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, సీడీపీఓలు పాల్గొన్నారు.


