
గోడపై నుంచి పడి మహిళకు తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : ఇంటి గోడపై నుంచి పడి మహిళ తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం మదనపల్లెలో జరిగింది. ఈశ్వరమ్మ కాలనీకి చెందిన రెడ్డెమ్మ ఇంటికి ఫైబర్ నెట్ కనెక్షన్ ఇవ్వగా, ఆ వైరు కిందకు వేలాడుతుండటంతో, ఇంటిగోడ పైకి ఎక్కి సరిచేసే క్రమంలో అదుపుతప్పి కిందకు పడి తలకు తీవ్ర గాయమైంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
రైలు కింద పడి ఆత్మహత్య
రైల్వేకోడూరు అర్బన్ : మండలంలోని అనంతరాజుపేట, రైల్వేకోడూరు రైల్వేస్టేషన్ మధ్యలో ఆర్.రాచపల్లి రైల్వేగేటు సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వృద్ధుడు(60) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకొన్నట్లు రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గౌరీశంకర్ తెలిపారు. మృతుడు తెల్లపంచ, షర్ట్ ధరించినట్లు తెలిపారు.
త్రుటిలో తప్పిన ప్రమాదం
చిన్నమండెం : పవిత్ర పుణ్య క్షేత్రం గండి నుంచి మదనపల్లెకు వెళ్తున్న కారుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. మదనపల్లెకు చెందిన ప్రయాణిలు గండి దర్శనం చేసుకుని తిరిగి వెళ్తుండగా చిన్నమండెం మండలం దేవగుడిపల్లె వద్దకు రాగానే కారు అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి
మైదుకూరు : మైదుకూరు – బద్వేలు రహదారిలో మండలంలోని బసవాపురం టోల్‌గేట్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని డేరంగుల పవన్ కుమార్ (23) అనే యువకుడు మృతి చెందాడు. ఎర్రగుంట్లకు చెందిన పవన్ కుమార్, నాగరాజు నాయక్ అనే వారు శనివారం రాత్రి మోటార్ బైక్‌పై బద్వేలు వైపు నుంచి వస్తుండగా టోల్ గేట్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. సంఘటనలో తీవ్రంగా గాయపడిన పవన్ కుమార్‌ను 108 వాహనంలో మైదుకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ప్రమాదంలో నాగరాజు నాయక్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మృతి చెందిన పవన్ కుమార్ అవివాహితుడని తెలుస్తోంది. సంఘటనపై కేసు నమోదు చేసుకొని ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలిస్తున్నట్టు మైదుకూరు అర్బన్ పోలీసులు ఆదివారం తెలిపారు.

గోడపై నుంచి పడి మహిళకు తీవ్ర గాయాలు