
ఓటరు స్లిప్పు లేకున్నా గుర్తింపు కార్డుతో ఓటు
● పోలింగ్ జరిగే అన్ని గ్రామాలకు బస్సులు, ఆటోలు
● కడప కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడప సెవెన్‌రోడ్స్ : పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో మంగళవారం జరగనున్న పోలింగ్‌లో ఓటర్లంతా నిర్భయంగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే జెడ్పీటీసీ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. బ్యాలెట్‌బాక్సుల ద్వారా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ మెటీరియల్ ఆయా పోలింగ్ కేంద్రాలకు పంపామన్నారు. ఓటర్లకు పోలింగ్ కేంద్రాల వివరాలతో కూడిన స్లిప్పులను పంపిణీ చేశామన్నారు. ఒకవేళ ఎకవరికై నా ఓటరు స్లిప్పులు లేకపోతే గుర్తింపు కార్డుతో వెళ్లి వివరాలు తెలియజేసి ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఓటర్లు తప్పకుండా తమ వెంట ఫొటో గుర్తింపు కార్డును తీసుకెళ్లి ఓటు వేయాలన్నారు. పోలింగ్ జరిగే అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంచామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద నలుగురు సిబ్బందితో హెల్ప్‌డెస్క్ ఉంటుందన్నారు. క్యూలైన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా అనవసరమైన రెచ్చగొట్టే వదంతులు ప్రసారం చేసినా, స్పందించకుండా ఓటర్లు ప్రశాంతంగా ఓటు వేయాలన్నారు. సాయంత్రం 5 గంటల సమయానికి క్యూలైన్‌లో నిలుచున్న వారందరితో ఓటు వేయిస్తారన్నారు.