
నులిపురుగుల నివారణతో ఆరోగ్యం
రాయచోటి టౌన్ : నులిపురుగుల నివారణతో పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని వైద్య ఆరోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. మంగళవారం విద్యార్థులకు అల్బెండజోల్ పంపిణీ కార్యక్రమం నిర్వహణలో భాగంగా సోమవారం రాయచోటి నియోజక వర్గంలోని లక్కిరెడ్డిపల్లె, గాలివీడు, రామాపురం, రాయచోటి ప్రాంతాలలోని పాఠశాలలు, హాస్టళ్లు, అండన్‌వాడీ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పిల్లలకు పంపిణీ చేసేందుకు ఉంచిన ఐఈసీ సామగ్రిని పరిశీలించారు. అనంతరం డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అధికారులతో సమావేశం నిర్వహించి, విజయవంతం చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అంతకు ముందుగా నులిపురుగుల నివారణ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కన్సల్టెంట్ హరికృష్ణ, డీఎంహెచ్‌వో డాక్టర్ లక్ష్మీనరసయ్య, డీఐవో డాక్టర్ ఉషశ్రీ, డాక్టర్ రియాజ్ బేగ్, ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఇ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం
గాలివీడు : విద్యార్థుల ఆరోగ్యంపై ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్ అనిల్ కుమార్ సూచించారు. మండలంలోని నూలివీడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ నిర్లక్ష్యం చేయకుండా ఐరన్ మాత్రలు, ఆల్బెండాజోల్ మాత్రలు తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ రియాజ్, డాక్టర్ శ్వేతా, వైద్య సిబ్బంది, ప్రధానోపాధ్యాలు రాజశేఖర్, ఉపాధ్యాయులు మనోహర్, ఫయాజ్, హరీష్, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.