
జెడ్పీటీసీ ఉప ఎన్నికకు పటిష్ట భద్రత
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక శాంతియుతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు పోలీసు అధికారులకు సూచించారు. సోమవారం మండల కేంద్రమైన ఒంటిమిట్టలోని టీటీడీ విడిది గృహంలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక భద్రత విధులను నిర్వహించేందుకు వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఆయన దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఓటర్లు ప్రశాంతంగా తమ ఓటును వినియోగించుకునేలా పోలీసులు భద్రత కల్పించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కడే గానీ జనాలు గుమికూడేలా ఉండకుండా విధులు నిర్వహించాలన్నారు. ఈ ఉప ఎన్నికకు మొత్తం 625 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

జెడ్పీటీసీ ఉప ఎన్నికకు పటిష్ట భద్రత