
కారు ఢీకొని యువకునికి గాయాలు
పీలేరు రూరల్ : కారు ఢీకొని యువకునికి తీవ్ర రక్తగాయాలైన సంఘటన పీలేరు పట్టణం తిరుపతి రోడ్డులో జరిగింది. ఎస్‌ఐ లోకేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చంద్రగిరికి చెందిన సుమంత్(19), తన ద్విచక్రవాహనంలో ఆదివారం ఉదయం పీలేరు నుంచి చంద్రగిరికి తిరుగు వెళుతున్న సమయంలో విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన సుమంత్‌ను స్థానికులు పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు సుమంత్‌ను మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ప్రమాదంపై ఎస్‌ఐ లోకేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.