
సమస్యల పరిష్కారం కోసమే ప్రజా సమస్యల వేదిక
రాయచోటి : ప్రజల సమస్యలను తెలుసుకుని చట్ట పరిధిలో వాటి పరిష్కారం కోసం పనిచేయడమే మన బాధ్యత అని జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు జిల్లా పోలీస్ యంత్రాంగానికి సూచించారు. సోమవారం రాయచోటిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి ఎస్పీ నేరుగా ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల సమస్యను వివరాలతో సహా అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు పంపించి త్వరగా పరిష్కరించమని ఆదేశించారు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళల సమస్యలపై సత్వరమే సమగ్ర విచారణ జరిపి, వారి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎీస్పీ తెలిపారు.
దివ్యాంగుడితో ఎస్పీ : రైల్వేకోడూరు మండలం సి.కమ్మపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు బాబు కోటేశ్వరరావు నడవలేని స్థితిలో ఉన్న తన తల్లి సమస్యను చెప్పుకునేందుకు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్పీ అతని వద్దకు వెళ్లి సమస్య విన్నారు. అతను ఇచ్చిన ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి చట్ట పరిధిలో అతని సమస్యను పరిష్కరించాలని రాజంపేట ఏఎస్పీని ఆదేశించారు.
జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు