
మహిళ కడుపులో 3 కిలోల కణితి తొలగింపు
రాయచోటి టౌన్ : రాయచోటి మండల పరిధిలోని యండపల్లెకు చెందిన అంజనమ్మ అనే మహిళ కడుపులో నుంచి 3 కిలోల బరువున్న కణితిని రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల బృందం తొలగించింది. సోమవారం అంజనమ్మకు డాక్టర్ లక్ష్మిప్రసాద్‌తో పాటు మరికొంతమంది వైద్యుల బృందం శస్త్ర చికిత్స చేసి ఈ కణితిని తొలగించారు. ఈమె గత పదేళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతూ వివిధ ప్రాంతాల్లో వైద్యం చేయించుకుంది. అయినా ప్రయోజనం లేదు. ఈ క్రమంలో సోమవారం రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వైద్యులు ఆమె కడుపులోని కణితిని తొలగించి ఉపశమనం కలిగించారు.
స్కూటీ అదుపుతప్పి మహిళకు గాయాలు
మదనపల్లె రూరల్ : సీటీఎం పంచాయతీ నేతాజీ కాలనీకి చెందిన సురేఖ (33) ఆదివారం రాత్రి సొంతపనులపై మదనపల్లెకు వచ్చి తిరిగి ఇంటికి వెళుతుండగా కొత్తవారిపల్లె వద్ద స్కూటీ అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడింది. స్థానికులు బాధితురాలిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళ్లారు.