డీసీసీ బ్యాంకులో రుణ‘మస్తు’ | - | Sakshi
Sakshi News home page

డీసీసీ బ్యాంకులో రుణ‘మస్తు’

Jul 29 2025 7:30 AM | Updated on Jul 29 2025 8:38 AM

డీసీస

డీసీసీ బ్యాంకులో రుణ‘మస్తు’

కడప అగ్రికల్చర్‌ : పంటల సాగుకు రైతులకు అవసరమైన పెట్టుబడి రుణాలను సకాలంలో అందిస్తూ వారి అభివృద్ధికి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీ) సహకారం అందిస్తోంది. రైతులతోపాటు వ్యాపారులు, డ్వాక్రా సంఘాలకు, హౌసింగ్‌ రుణాలు, వ్యక్తిగత రుణాలు, ఎడ్యుకేషన్‌ రుణాలతోపాటు పలు రకాల రుణాలను అందిస్తూ వారి అభివృద్ధిని ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ సాయాన్ని అందిపుచ్చుకుంటున్న రైతులు సకాలంలో పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు. జూన్‌ నెల నుంచి ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైంది. రైతన్నల పంటల సాగుకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు బ్యాంకులు రుణాలను అందించనున్నాయి. ఈ తరుణంలో ఎవరెవరికి ఎంతెంత రుణాలను ఇవ్వాలనే లక్ష్యాన్ని డీసీసీ బ్యాంకు ఖరారు చేసింది. ఇతర బ్యాంకుల కంటే కొన్నింటిపైన తక్కువ వడ్డితో రుణాలను అందించి వారి అబివృద్థికి చేయూతనిస్తోంది.

ఈ ఏడాది లక్ష్యం రూ. 807 కోట్లు..

డీసీసీ బ్యాంకు తరపున జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ. 807 కోట్ల రుణాలను మంజూరు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో వ్యవసాయ, స్వల్పకాలిక, దీర్ఘకాలిక, బంగారు ఆభరణాలు, వ్యవసాయేతర రుణాలతోపాటు డ్వాక్రా మహిళలకు రుణాలను ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో బంగారు ఆభరణాలపై రూ. 157 కోట్లు, పంట రుణాల కింద రూ. 69.94 కోట్లు, డ్వాక్రా సంఘాలకు రూ. 152.04 కోట్లు, దీర్ఘకాలిక రుణాల కింద రూ. 96.75 కోట్లు, రైతు నేస్తం కింద రూ. 46.81 కోట్లు, ఇతర రుణాల కింద రూ. 50 కోట్లు రుణాలను ఇవ్వనున్నారు. అలాగే వీటితోపాటు పలు రకాల రుణాల కింద మొత్తంగా రూ. 613 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. వీటితోపాటు డిపాజిట్ల కింద వివిధ వర్గాలు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ. 194 కోట్లు సేకరించాలని బ్యాంకు వారు టార్గెట్‌ పెట్టుకున్నారు. అయితే డిపాజిట్లకు సంబంధించి 7.65 శాతం వడ్డీ ఇవ్వనున్నారు. ఇందులో సీనియర్‌ సిటిజన్లు చేసిన డిపాజిట్లకు 8.15 శాతం వడ్డీని చెల్లించనున్నారు.

అన్నదాతలకు అండగా..

వ్యాపారులకు దన్నుగా

2025–26 ఆర్థిక సంవత్సర

రుణ లక్ష్యం రూ. 807 కోట్లు

వ్యవసాయానికి రూ.104.69

కోట్ల రుణాలు

వ్యవసాయేతర రుణాలు

రూ. 508.31 కోట్లు

రూ. 194 కోట్ల డిపాజిట్ల సేకరణ లక్ష్యంగా అడుగులు

ఎలాంటి సిఫార్సులు లేకుండానే..

డీసీసీ బ్యాంకులో రుణాల మంజూరుకు ఎలాంటి సిఫార్సులు అవసరం లేదు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రుణాలను మంజూరు చేస్తాం. కమర్షియల్‌ బ్యాంకుల్లో లాగా మా బ్యాంకులో కూడా అన్ని రకాల రుణాలను అందిస్తున్నాము. రుణాలు కావాల్సిన వారు పత్రాలను తీసుకుని నేరుగా వచ్చి బ్యాంకు అధికారులను సంప్రదించవచ్చు. పరిశీలించి అర్హత ఉంటే రుణాలను మంజూరు చేయించుకోవచ్చు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాల్సి ఉంటుంది.

– రాజామణి, సీఈఓ(ఇన్‌చార్జి), డీసీసీ బ్యాంకు. కడప

డీసీసీ బ్యాంకులో రుణ‘మస్తు’1
1/2

డీసీసీ బ్యాంకులో రుణ‘మస్తు’

డీసీసీ బ్యాంకులో రుణ‘మస్తు’2
2/2

డీసీసీ బ్యాంకులో రుణ‘మస్తు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement