
వివాహిత ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ పత్తికోటకు చెందిన శ్రీనివాసులు భార్య రేఖ(31) వ్యక్తిగత సమస్యలతో విష పదార్థం తిని ఆత్మహత్యకు యత్నించింది. భర్త ఉపాధి నిమిత్తం కువైట్‌లో ఉండగా కుమారుడు బెంగళూరులో చదువుకుంటున్నాడు. స్థానికులు బాధితురాలిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ములకలచెరువు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
ఎస్టీ వర్గీకరణ కోసం యానాదుల పోరుబాట
రాజంపేట : ఎస్టీ వర్గీకరణ అమలు చేయాలంటూ యానాదులు సోమవారం రాజంపేటలో ర్యాలీ నిర్వహించారు. యానాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పులిశంకర్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో యానాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకుడు బాపట్ల బ్రహ్మయ్య, ఉద్యోగులసంఘం రాష్ట్ర అధ్యక్షుడు చేవ్వూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. యానాది రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు కల్లూరు చిన్నపెంచలయ్య మాట్లాడుతూ ఎస్టీ వర్గీకరణతో యానాదులకు న్యాయం జరుగుతుందన్నారు. అనంతరం సబ్‌కలెక్టర్ వైకోమానైదియాదేవికి యానాదులు వినతిపత్రం అందజేశారు.

వివాహిత ఆత్మహత్యాయత్నం