విజయవాడ: ఏపీలో జడ్పీ ఛైర్మన్ సీట్లకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు–2026 నేపథ్యంలో వివిధ జిల్లాల జిల్లా పరిషత్ (ZP) చైర్మన్ పదవులకు రిజర్వేషన్లను ప్రకటించారు. ఏపీలో జడ్పీ చైర్మన్ల రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లాల వారీగా జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఇవే!
🔹 అనకాపల్లి – బీసీ మహిళ
🔹 అనంతపురం – బీసీ
🔹 అన్నమయ్య – జనరల్
🔹 అల్లూరి సీతారామరాజు – ఎస్టీ
🔹 బాపట్ల – జనరల్ మహిళ
🔹 చిత్తూరు – జనరల్ మహిళ
🔹 డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ – ఎస్సీ మహిళ
🔹 తూర్పుగోదావరి – జనరల్ మహిళ
🔹 ఏలూరు – జనరల్ మహిళ
🔹 గుంటూరు – ఎస్సీ మహిళ
🔹 కాకినాడ – జనరల్ మహిళ
🔹 కృష్ణా – జనరల్ మహిళ
🔹 కర్నూలు – బీసీ
🔹 మార్కాపురం – జనరల్
🔹 నంద్యాల – జనరల్
🔹 ఎన్టీఆర్ – ఎస్సీ
🔹 పల్నాడు – జనరల్ మహిళ
🔹 పోలవరం – ఎస్టీ మహిళ
🔹 ప్రకాశం – ఎస్సీ
🔹 పార్వతీపురం మన్యం – ఎస్టీ
🔹 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు – జనరల్
🔹 శ్రీ సత్యసాయి – జనరల్
🔹 శ్రీకాకుళం – బీసీ మహిళ
🔹 తిరుపతి – ఎస్సీ మహిళ
🔹 విశాఖపట్నం – బీసీ
🔹 విజయనగరం – బీసీ మహిళ
🔹 పశ్చిమగోదావరి – జనరల్
🔹 వైఎస్సార్ కడప – జనరల్
జిల్లాల వారీగా రిజర్వేషన్లు ఖరారు కావడంతో జిల్లా పరిషత్ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న వేళ..ఆశావహులు తమ రాజకీయ భవిష్యత్తుపై లెక్కలు వేసుకుంటున్నారు.

ఇదీ చదవండి: ‘ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ చేసిన మేలు కనిపించదా?’


