ప్రజారోగ్యానికే ప్రథమ ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్యానికే ప్రథమ ప్రాధాన్యం

Nov 28 2026 1:38 AM | Updated on Nov 28 2026 1:38 AM

పటమట(విజయవాడతూర్పు): ప్రజారోగ్య పరిరక్షణే తన ప్రథమ ప్రాధాన్యతని, విజయవాడ నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని విజయవాడ నగరపాలక సంస్థ మేయర్‌ వంగవీటి రాధా కృష్ణన్‌ అన్నారు. శుక్రవారం ఉదయం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్‌లో మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌ సభ్యుడు కేశినేని శివనాథ్‌(చిన్ని), శాసనసభ్యులు గద్దె రామమోహన్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ ధ్యానచంద్ర, మేయర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మేయర్‌ వంగవీటి రాధ ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా రూపొందించిన ‘మిషన్‌ హెల్దీ విజయవాడ’ కార్యక్రమానికి సంబంధించిన ఫైల్‌పై తన తొలి సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నెల రోజుల పాటు నగరవ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణ, పర్యావరణ పరిశుభ్రతకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ అమలు చేయనున్నామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొని మేయర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

డెప్యూటీ మేయర్‌ బాధ్యతలు స్వీకరణ..

నగరపాలక సంస్థ డెప్యూటీ మేయర్‌ చెన్నుపాటి కాంతిశ్రీ శుక్రవారం ఉదయం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్‌ భవనంలో తనకు కేటాయించిన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ విజయవాడ నగర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

విజయవాడ మేయర్‌గా

బాధ్యతలు స్వీకరించిన వంగవీటి రాధ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement