‘ఐదేళ్ల పాలనలో వైఎస్‌ జగన్‌ చేసిన మేలు కనిపించదా?’ | YSRCP MLC Ramesh Yadav Slams Yellow Media | Sakshi
Sakshi News home page

‘ఐదేళ్ల పాలనలో వైఎస్‌ జగన్‌ చేసిన మేలు కనిపించదా?’

Oct 13 2026 7:24 PM | Updated on Oct 13 2026 7:38 PM

YSRCP MLC Ramesh Yadav Slams Yellow Media
  • బీసీలకు టీడీపీ చేసిన మోసాలను రాసే దమ్ముందా?
  • ఈనాడుకు ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ ఛాలెంజ్‌
  • నిలదీసిన ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌

తాడేపల్లి. బీసీలకు వెన్నుపోటు పొడిచిన పార్టీకి కొమ్ముకాస్తూ, ఇంకో పక్క బీసీలను రాజకీయంగా తిరుగులేని శక్తిగా నిలిపిన వైఎస్సార్‌సీపీ గురించి ’ఈనాడు’ పత్రిక పచ్చి అపద్ధాలతో తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై వైకాపా రాజకీయ క్రీడ’ అంటూ ఈనాడు రాసిన కథనంపై ఆయన ధ్వజమెత్తారు. వెన్నుపోటు పార్టీ తమ మేనిఫెస్టోలో బీసీ డిక్లరేషన్‌ పేరుతో 34% రిజర్వేషన్లు ఇస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక మోసం చేసిందని గుర్తు చేశారు.  

ఇంకా నాడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జీఓ నెం:176 ద్వారా 34% రిజర్వేషన్లు కల్పిస్తే సీఎం చంద్రబాబు, తన వెన్నుపోటు పార్టీకి చెందిన వ్యక్తి ద్వారా హైకోర్టులో పిటిషన్‌ వేయించి అడ్డుకుందని గుర్తు చేశారు. కాగా, వైఎస్‌ జగన్‌ జనరల్‌ స్ధానాల్లో సైతం బీసీలను నిలిపి రాజకీయంగా ఉన్నత అవకాశాలు కల్పించారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రమేష్‌ యాదవ్‌ చెప్పారు. ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..:

ఈనాడుకు ఆ ధైర్యం ఉందా?
వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం, బీసీలకు సంక్షేమ పథకాలు అందకుండా అణగదొక్కాలని చూస్తోంది. ఈ రెండున్నర ఏళ్లలో ఈ ప్రభుత్వం బీసీలకు చేసిందేమీ లేదు. అయినా నైతికంగా పూర్తిగా దిగజారిన, జర్నలిజమ్‌ విలువలకు పూర్తిగా పాతరేసిన ఈనాడు వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వాన్ని నిత్యం జాకీలతో ఎత్తుతోంది. అందుకోసం మా పార్టీపైనా, గత మా ప్రభుత్వంపైనా అడ్డగోలుగా ఆరోపణలు, విమర్శలు చేస్తోంది.

మరోవైపు, రాజకీయంగా ఎదుగుతున్న మాజీ మంత్రులు సీదిరి అప్పలరాజు, జోగి రమేష్, విడదల రజిని, తమ్మినేని సీతారాం, కారుమూరి నాగేశ్వరరావు వంటి బీసీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారు. వారిని ఎదగనీయకుండా వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. 

నిజానికి గత మా ప్రభుత్వం బీసీలకు రాజకీయ పరంగా కానీ, పథకాల అమలులో కానీ.. చాలా ప్రాధాన్యం ఇచ్చింది. వివిధ సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ, నాన్‌ డీబీటీ విధానంలో ఒక్క బీసీల కోసమే చేసిన వ్యయం రూ.1,82,750.71 కోట్లు కాగా, వాటి ద్వారా బీసీలకు అందిన ప్రయోజనాలు అక్షరాలా 5,53,66,581. ఈ స్థాయిలో గతంలో ఏనాడైనా, చంద్రబాబు తాను పదవిలో ఉన్నప్పుడు అప్పుడైనా, ఇప్పుడైనా బీసీలకు ప్రయోజనాలు అందించారా?. అలాగే రాజకీయ పదవుల్లో కూడా నాడు బీసీలకు అత్యధిక ప్రాధాన్యం దక్కింది. అవన్నీ రాసే ధైర్యం ఇదే ఈనాడుకు ఉందా?.

నైతికత ఉంటే వాస్తవాలు రాయండి
మా పార్టీపై బురద చల్లుతూ, తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న ఈనాడు.. ఇదే వెన్నుపోటు పార్టీ బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీల అమలుపై ఎందుకు ప్రశ్నించడం లేదు? బీసీలకు సంక్షేమ పథకాలు, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే విషయంలో వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం ఏం చేసిందో ఈనాడు రాయగలదా? రాజకీయంగా ఎదుగుతున్న వైఎస్సార్‌సీపీ బీసీ నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలు సాగుతున్నాయి. మరి ఆ కేసుల్లో వాస్తవాలు పరిశీలించి ప్రచురించే ధైర్యం ఈనాడుకు ఉందా?

ఇంకా బీసీలకు సంబంధించి మేం చెప్పింది ఒకవేళ అవాస్తవం అనుకుంటే, ఆ గణాంకాలు అధికారిక రికార్డులతో పరిశీలించండి. కనీసం అప్పుడైనా వాస్తవాలు గుర్తించండి. మీకు ఏ మాత్రం నైతికత ఉన్నా, పత్రికా విలువలపై ఏ మాత్రం గౌరవం ఉన్నా, వాటన్నింటినీ ప్రచురించండి.

ఈ అంశాలపై టీడీపీని ప్రశ్నించే దమ్ముందా?
రోజూ మాపై బురద చల్లడం కాదు. అవాస్తవాలు ప్రచారం చేయడం కాదు. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయని ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత కూడా మీకుంటుంది. 2024 ఎన్నికల సమయంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని వెన్నుపోటు పార్టీ ఇచ్చిన హామీని ఇప్పుడు ఏ విధంగా అమలు చేస్తున్నారో ఇదే ఈనాడు ప్రశ్నించగలదా? బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, సంక్షేమ పథకాలు, విద్య, ఆర్థిక భరోసా విషయంలో కూటమి ప్రభుత్వం సాధించిన పురోగతి ఏమిటో ప్రజలకు వివరించగలదా? బీసీ కులాల అభివృద్ధి కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు, కల్పించిన పదవులు, అమలు చేసిన పథకాలపై సమగ్ర కథనాలు ప్రచురించగలదా? బీసీల విషయంలో వైఎస్సార్‌సీపీని ప్రశ్నించినట్లే టీడీపీని కూడా ప్రశ్నించాలి.

వైఎస్‌ జగన్‌ పాలనలో బీసీలకు రాజకీయ సాధికారత
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో కేవలం మాటల్లో కాకుండా అన్నీ చేతల్లో చూపారు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అత్యున్నత ప్రాధాన్యతను అందించారు.  గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 25 ఎంపీ స్థానాలకు గాను 11 స్థానాలు (44%), రాజ్యసభలో నలుగురు సభ్యులు, మరియు 58 ఎమ్మెల్సీలలో 28 మందికి పైగా స్థానాలు కేటాయించి బీసీలకు చట్టసభలలో సముచిత స్థానం కల్పించారు. అంతే కాకుండా, జెడ్పీ చైర్మన్లు, మేయర్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌ స్థానాలలో 36 నుండి 46 శాతానికి పైగా పదవులను బీసీలకే కేటాయించి వారిని స్థానిక సంస్థల్లో తిరుగులేని శక్తిగా మార్చారు. విద్య, వైద్యం, సంక్షేమ పథకాల ద్వారా ప్రతి పేద బీసీ కుటుంబానికి వైఎస్‌ జగన్‌ అండగా నిలిచారు. ఇదే ఈనాడుకు దమ్ముంటే అవన్నీ ప్రచురించాలని ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ సవాల్‌ చేశారు.

ఇదీ చదవండి:  దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు: తూమాటి మాధవరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement