ఆంధ‍్రప్రదేశ్ మండలి డిప్యూటీ ఛైర్మన్ తూమాటి మాధవరావు మంగళవారం ఏపీ గవర్నర్‌ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కౌన్సిల్‌లో జరిగిన ఎన్నికల్లో తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని, చైర్‌లో కూర్చోబెట్టే ముందు కూటమి సభ్యులు బయటకు వెళ్లిపోయారని తెలిపారు.
‘‘దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. నాకు పీఎస్, అడిషనల్ పీఎస్, సిబ్బంది ప్రొటోకాల్ ఇవ్వలేదు. మా ఊరిలో కూడా టెంపుల్ వీవీఐపీ గేట్‌కు తాళం వేశారు. నన్ను కాదు.. శాసనసభా మర్యాదలను కించపర్చుతున్నారు. సెక్రటరీ జనరల్, ప్రభుత్వం ఇద్దరు గేమ్ ఆడుతున్నారు. అన్ని విషయాలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాను’’ అని తూమాటి మాధవరావు అన్నారు.


