ఏ మొహం పెట్టుకుని రాజమండ్రిలో మహానాడు పెట్టారు: ఎంపీ భరత్‌

MP Bharath Serious Comments TDP Chandrababu - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌ సీరియస్‌ అయ్యారు. చంద్రబాబుది పెత్తందారీ మనస్తత్వం. పబ్లిసిటీ కోసం ప్రజల ప్రాణాలు తీసే వ్యక్తి చంద్రబాబు అంటూ ఫైరయ్యారు. వెన్నుపోటు పొడవటం ఎందుకు?.. శత జయంతి ఉత్సవాలు జరపడమెందుకు అని ప్రశ్నించారు. 

కాగా, ఎంపీ భరత్‌ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాల్లో 29 మందిని పొట్టన పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు. ఆయన నిర్వాకంతోనే పుష్కరాల్లో తొక్కిసలాట జరిగింది. పబ్లిసిటీ కోసం చంద్రబాబు 29 మంది ప్రాణాలు తీశారు. కనీసం మృతుల కుటుంబాలను కూడా చంద్రబాబు పరామర్శించలేదు. ఏ మొహం పెట్టుకుని రాజమండ్రిలో మహానాడు పెట్టారు. రాజమండ్రిని నాశనం చేశారు. రోడ్డంతా కన్నాలు పెడుతున్నారు. దండి మార్చ్‌ విగ్రహాల చుట్టూ టీడీపీ జెండాలు కట్టారు. ఎంతకు తెగిస్తే ఇవన్నీ చేస్తారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఇది కూడా చదవండి: ‘అచ్చెన్నాయుడు పైల్స్.. వాళ్ల మాయరోగాలు గుర్తున్నాయా?’

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top