చంద్రబాబూ.. ఇప్పుడేమంటారు? | YSRCP MLC Iqbal Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

ఇండియా టుడే సర్వే జగన్‌ పనితీరుకు కొలమానం

Aug 8 2020 7:49 PM | Updated on Aug 8 2020 8:00 PM

YSRCP MLC Iqbal Comments On Chandrababu - Sakshi

సాక్షి, అనంతపురం: ఇండియా టుడే సర్వే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి కనువిప్పు కావాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఇక్భాల్‌ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్ 3వ స్థానంలో నిలిచారని, ఆయన పనితీరు కు ఈ సర్వే కొలమానం అని పేర్కొన్నారు. రాజీనామాలు చేయాలని కోరిన చంద్రబాబు ఇప్పుడేమంటారని ఆయన‌ ప్రశ్నించారు. సంక్షేమం-అభివృద్ధి తో సీఎం జగన్ దూసుకెళ్తున్నారన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే చంద్రబాబు కూడా ఓడిపోతారని, టీడీపీ ఎమ్మెల్యేలకు దమ్ము, ధైర్యం ఉంటే అమరావతి కోసం రాజీనామాలు చేసి ఎన్నికల కు వెళ్లాలని ఆయన సవాల్‌ విసిరారు. చంద్రబాబు విధ్వంసాన్ని ప్రేరేపించేలా మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ ఇక్బాల్‌ దుయ్యబట్టారు. (‘జగన్‌ భవిష్యత్తులో మీరు ఫస్ట్‌ ర్యాంక్‌ సాధిస్తారు’)

Advertisement
 
Advertisement
Advertisement